Begin typing your search above and press return to search.
దయచేసి దీన్ని ప్రేమ అనొద్దు.. ఇది పూర్తి పైశాచికం
By: Tupaki Desk | 1 Jun 2021 4:30 AM GMTకాలం మారుతున్న కొద్దీ.. మనుషుల మధ్య గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. ఆధునికత పేరుతో ఆరాచకాన్ని అంతకంతకూ పెంచుకుపోతున్న వైనం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే. యాభై ఏళ్ల క్రితం ప్రేమ కథల్ని చూస్తే.. తమ ప్రేమ పెళ్లి పీటల వరకు రాకపోతే.. తల్లడిల్లిపోయే మనసు.. కుమిలిపోవటమే తప్పించి పగ.. ప్రతీకారాల గురించి ఆలోచించేది. ఆ మాటకు వస్తే.. ప్రేమించినోళ్లు సుఖంగా.. సంతోషంగా.. నవ్వుతూ ఉండాలన్న ఆశ.. అంతకు మించిన ఆకాంక్ష అప్పటి మనషుల్లో కనిపించేది.
ఇప్పుడు అదంతా మారిపోయింది. తాము కోరుకున్నది దక్కకుంటే చాలు.. చంపేందుకు సైతం వెనుకాడని పైశాచిక ప్రేమ ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే బిహార్ లో చోటు చేసుకుంది. అక్కడి నలంద జిల్లాలోని భగాన్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే.
షబ్నంకు వికాస్ కుమార్ కు మే 26న వివాహమైంది. పెళ్లైన నాలుగో రోజున భర్తతో కలిసి పుట్టింటికి బయలుదేరింది ఫబ్నం. మార్గమధ్యంలో బైక్ మీద వచ్చిన రాజ్ పాల్ అలియాస్ రేహాన్ వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయిని మరొకరు పెళ్లి చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కోపంతో ఊగిపోతూ షబ్నంను తనతో రావాలని బలవంతంగా చేశాడు. ఇందుకు ఆమె ససేమిరా అన్నది.
దీంతో కోపం ఆపుకోలేని అతడు.. షబ్నంను పాయింట్ బ్లాక్ లో పిస్టల్ పెట్టి ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో.. ఆమె అక్కడికక్కడే కూలిపోయింది. ఆమెపై కాల్పులు జరిపిన అనంతరం.. తనను తాను కాల్చుకున్నాడు. ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షబ్నం అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తేల్చారు. రాజ్ పాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని పాట్నాకు తరలించారు. మార్గమధ్యలోనే అతడు మరణించాడు.
ఈ ఉదంతాన్ని చూసిప్పుడు అనిపించేది ఒక్కటే.. తాను అమితంగా ప్రేమించిన అమ్మాయి.. పెళ్లి చేసుకొని భర్తతో సుఖంగా.. సంతోషంగా తన దారిన తాను వెళుతుంటే.. ఓర్చుకోలేని తత్త్వం ఇంతటి దారుణానికి కారణమైందన్నది మర్చిపోకూడదు. నిజంగా.. మనం ప్రేమించినోళ్లు సంతోషంగా ఉండటానికి మించింది మరొకటి లేదన్న వాస్తవాన్ని ఈ డిజిటల్ యుగపు పిల్లలు ఎప్పటికి తెలుసుకుంటారన్న సందేహం కలుగక మానదు.