Begin typing your search above and press return to search.
ఢిల్లీలో లేడీని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఆడవాళ్లు
By: Tupaki Desk | 28 Jan 2022 10:31 AM GMTఢిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆడవాళ్ల నుంచి ఆడవాళ్లకే రక్షణ లేకుండా పోయింది. గణతంత్ర దినోత్సవం రోజున ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను కిడ్నాప్ చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ వ్యవహారంలో తోటి మహిళలే నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
వివేక్ విహార్ కు చెందిన ఓ మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు మహిళలే కిడ్నాప్ చేయించి ఆమెపై అత్యాచారం చేయించారని తేలింది.
అంతేకాదు అనంతరం బాధితురాలి జుట్టు కత్తిరించి మెడలో చెప్పుల దండలు వేసి ఆమెను కొడుతూ ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు సీరియస్ గా తీసుకొని ఈ కేసులో నలుగురు ఆడవాళ్లను అరెస్ట్ చేశారు.
కేసులో లోతుగా దర్యాప్తుచేసిన పోలీసులకు బాధితురాలి వ్యక్తిగత శత్రువులే ఈ దారుణానికి పాల్పడినట్లుగా తేల్చారు.
అత్యాచారానికి గురై మహిళకు వివాహమైంది. ఓ బిడ్డ కూడా ఉంది. అయితే కొద్దిరోజుల క్రితం బాధిత మహిళ వెంట ఓ యువకుడు తిరిగేవాడని.. అతడు గత ఏడాది నవంబర్ లో ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. అతడి చావుకు కారణాలు ఏమైనప్పటికీ బాధితురాలి వల్లే ప్రాణాలు తీసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులు భావించారు.
అప్పటి నుంచి బాధిత మహిళపై శత్రుత్వం పెంచుకున్నారు. ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు కిడ్నాప్ చేసి అటుపై అత్యాచారం చేయించిన తర్వాత ఆమెను తీవ్రంగా అవమానించారు. నడిరోడ్డుపై మెడలో చెప్పులదండ వేసి ముఖంపై కొడుతూ ఊరేగించారు. విషయం బాధితురాలి సోదరి ద్వారా తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని ఆమెను కాపాడారు. దాడి చేసిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు.