Begin typing your search above and press return to search.
దుబాయ్ లో షాకింగ్ ఘటన..బాల్కనీలో 10 మంది అమ్మాయిలు నగ్నంగా ఫోటోలు
By: Tupaki Desk | 6 April 2021 4:30 AM GMTఅరబ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. చిన్న తప్పునకు పెద్ద శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అక్కడి చట్టాల్ని అతిక్రమిస్తే.. ఊచలు లెక్కించాల్సిందే. అలాంటిది ఎందుకు చేశారో తెలీదు కానీ.. ఇప్పుడో ఉదంతం ఇప్పుడా దేశంలో షాకింగ్ గా మారింది. బహుళ అంతస్తులున్న భారీ టవర్ లో పది మందికిపైగా అమ్మాయిలు బాల్కనీలో నగ్నంగా నిలబడి ఫోటోలు తీసుకున్న వైనం సంచలనంగా మారింది.
ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో దుబాయ్ అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో.. అలెర్టు అయిన పోలీసులు ఆ యువతులు ఉన్న అపార్ట్ మెంట్ చిరునామా తెలుసుకొని అరెస్టు చేశారు. దుబాయ్ చట్టాల ప్రకారం నగ్నంగా బాల్కనీలో నిలుచున్న యువతులపై క్రిమినల్ కేసుల్ని నమోదు చేశారు. వారిని త్వరలో కోర్టుకు హాజరు పర్చనున్నారు. ఇంతకీ వారు ఎందుకిలా చేశారు? దానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు.
కాకుంటే.. యూఏఈ సొసైటీ విలువలకు భంగం కలిగించేలా ఆ యువతులు వ్యవహరించారని.. ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు.. వారు చేసిన పనికి ఆర్నెల్లు జైలుశిక్షతో పాటు.. మన కరెన్సీ ప్రకారం లక్ష రూపాయిలకు పైనే ఫైన్ విధించే వీలుందని చెబుతున్నారు. యూఏఈ చట్టాల ప్రకారం అశ్లీలత.. జూదం.. దూషణలు.. బెదిరింపులు లాంటి నేరాలకు శిక్షలు తీవ్రంగా ఉంటాయి. ఇక.. అత్యాచారాలు.. హత్యలకైతే ఏకంగా మరణశిక్షను అమలు చేస్తారు.