Begin typing your search above and press return to search.

ఈ వీడియో మిస్ కావొద్దు.. పెద్ద గండాన్ని తప్పించుకోవచ్చు సుమా!

By:  Tupaki Desk   |   16 Oct 2021 3:20 AM GMT
ఈ వీడియో మిస్ కావొద్దు.. పెద్ద గండాన్ని తప్పించుకోవచ్చు సుమా!
X
ఏదైనా జరిగినప్పుడు.. ప్రమాదానికి కారణమైన వారిని.. ప్రమాదం బారిన పడిన వారిని ఒక మాటను చటుక్కున అనేస్తుంటాం. కానీ.. రోజువారీ జీవితంలో మనం కూడా అలాంటి తప్పులు చేస్తుంటాం. ఈ వీడియోలో న్యూస్ సెన్సు కంటే కూడా.. లైఫ్ సెన్సుకు అవసరమైన గట్టి గుణపాఠం ఉంది. అందుకే.. ఈ వీడియోను మీకు చూపించటం ద్వారా.. మిమ్మల్నిఅలెర్టు చేయటంతో పాటు.. మీకు తెలిసిన వారిని సైతం కాస్తంత జాగ్రత్తగా ఉండమని చెప్పాలన్నదే మా ఉద్దేశం.

నిమిషం కంటే తక్కువ వ్యవధి ఉన్న ఈ వైరల్ వీడియోను చూసినప్పుడు.. రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు ప్రమాదం మన పక్కనే ఎలా పొంచి ఉంటుందన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఫరీదాబాద్ లో. ఒక మహిళ రోడ్డు మీద నడుస్తూ వెళుతోంది. చంకలో చంటి బిడ్డను ఎత్తుకున్న ఆమె.. మరో చేత్తో సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళుతున్నారు.

చూపు ముందు వైపు ఉంది కానీ.. నడుస్తున్న నేల మీద లేదు. కారణంగా.. సెల్ ఫోన్ సంభాషణే. భుజానికి బుజ్జితల్లి మనతో ఉన్నప్పుడు మరెంతో కేర్ ఫుల్ గా ఉండాలి. కానీ.. ఆ విషయాన్ని ఫోన్ మాట్లాడే క్రమంలో బాధిత మహిళ మర్చిపోయినట్లున్నారు. రోడ్డు మీద వెళుతున్న ఆమె.. రోడ్డు మీద తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ ను ఆమె చూసుకోలేదు.కాకుంటే.. రోడ్డుకు ఒకవైపు మ్యాన్ హోల్ కు అడ్డంగా పెద్ద సైన్ బోర్డు పెట్టారు.

కానీ.. ఫోన్ లో మాట్లాడుతూ వెళుతున్న ఆమె.. తన పక్కనే ఉన్న మ్యాన్ హోల్ ను చూసుకోకపోవటం.. చటుక్కున జారి అందులో పడిపోయారు చంటి బిడ్డతో సహా. లక్కీగా స్థానికులు అక్కడే ఉండటం.. జరిగిన ఘోర ప్రమాదాన్ని గుర్తించి.. వెంటనే వచ్చి.. మ్యాన్ హోల్ నుంచి సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఉదంతం ఎలా జరిగిందన్న విషయాన్ని గుర్తించేందుకు సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే.. అందులో సదరు మహిళ సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళుతుండగా.. ప్రమాదం చోటు చేసుకుందన్న విషయాన్ని గుర్తించారు. వీడియోను చూసిన తర్వాత.. సెల్ ఫోన్ మాట్లాడుతూ.. రోడ్డు మీద నడవటం ఎంత ప్రమాదమన్నది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. దయచేసి.. మీరీ తప్పును మాత్రం అస్సలు చేయొద్దు.