Begin typing your search above and press return to search.

ఉద్యోగం ఇస్తానంటూ ఇంటర్వ్యూకు హోటల్ కు వెళ్లింది.. కట్ చేస్తే

By:  Tupaki Desk   |   27 Jun 2021 6:30 AM GMT
ఉద్యోగం ఇస్తానంటూ ఇంటర్వ్యూకు హోటల్ కు వెళ్లింది.. కట్ చేస్తే
X
నెలకు రూ.20వేల ఉద్యోగం రెఢీగా ఉందన్న ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. నమ్మి ఇంటర్వ్యూకు వెళ్లిన ఆమెకు రెండు నెలలుగా నరకాన్ని చూస్తోంది. ఈ దారుణం గురించి వింటే రక్తం మరిగిపోతుంది. ఈ దుర్మార్గం వెనుకున్న వారి గురించి తెలిస్తే మరింత షాక్ కు గురి కావాల్సిందే. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

16 ఏళ్ల యువతికి సంతోష్ కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన దగ్గర నెలకు రూ.20వేల ఉద్యోగం రెఢీగా ఉందని నమ్మించాడు. ఇంట్లో చెప్పకుండా ఇంటర్వ్యూకు వెళ్లి ఉద్యోగాన్ని సాధించి ఇంట్లోవారిని సర్ ప్రైజ్ చేయాలన్న ఆమె ఆలోచన.. ఆమెకు దారుణ అనుభవాన్ని మిగిల్చింది. ఇంటర్వ్యూ కోసం ఒక హోటల్ కు తీసుకెళ్లి.. సదరు హోటల్ యజమాని ఇంటర్వ్యూ చేస్తాడని రూంలోకి తీసుకెళ్లాడు. అనంతరం తినే ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు.

మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం చేసి.. దాన్ని వీడియో తీశాడు. దాన్ని చూపించి బెదిరిస్తూ అదే పనిగా రేప్ చేయసాగాడు. హోటల్ రూంలో బంధించి.. బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. బయటకు వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవటంతో భయపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసు కంప్లైంట్ ఇచ్చి విపరీతంగా గాలించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే.. ఆమెను బంధించిన హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు తనిఖీలు చేయగా.. రూంలో బంధీగా ఉన్న బాధితురాలిని పోలీసులు రక్షించారు. మాయమాటలు చెప్పిన సంతోష్ కుమార్ తో పాటు.. ఈ వ్యభిచార రాకెట్ మొత్తానికి సూత్రధారి అయిన హోటల్ యజమాని.. ఒక మహిళతో పాటు.. హోటల్లోనే ఉన్న మరో రిపోర్టర్ ను కూడాపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారని.. ఆమె అందుకు నో చెప్పటంతో.. గదిలో ఉంచి నిత్యం రేప్ చేసే వారని గుర్తించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.