Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో దారుణంః నీ న‌డుము సైజు లావుగా ఉంది. దాన్ని త‌గ్గించాలి

By:  Tupaki Desk   |   3 April 2021 7:30 AM GMT
హైద‌రాబాద్ లో దారుణంః నీ న‌డుము సైజు లావుగా ఉంది. దాన్ని త‌గ్గించాలి
X
అమ్మాయిల‌ను కేవ‌లం శృంగార సాధ‌నంగా చూసే పురుషుల సంఖ్య ఈ సంఖ్య భారీగా ఉంది. ఏదో ఒక వంక‌న వారి దేహంపై క‌న్నేసే వారే ఎక్కువ‌గా ఉంటున్నారు. అయితే.. ఆ క్ష‌ణం వ‌ర‌కూ వారు అలాంటి వార‌ని గుర్తించ‌లేక‌పోతున్నారు అమ్మాయిలు. దీంతో.. కొంద‌రు బ‌య‌ట‌ప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రు మాన‌ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.

హైద‌రాబాద్ కు చెందిన ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకోవ‌డానికి ఓ ఇనిస్టిట్యూట్ లో చేరింది. కొన్ని రోజులుగా రోజూ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వుతూ వ‌స్తోంది. అయితే.. ఆ ఇనిస్టిట్యూట్ నిర్వాహ‌కుడు స‌ద‌రు బాలిక‌పై క‌న్నేశాడు. కానీ.. ఈ విష‌యం అమాయ‌కురాలు గుర్తించ‌లేక‌పోయింది.

‘నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావుగానీ.. నీ న‌డుము సైజు లావుగా ఉంది. దాన్ని త‌గ్గించాలి’ అని చెప్పాడు. దీనికోసం ఉదయాన్నే స్పెషల్ వర్కవుట్లు చేయాలి. మన ఇనిస్టిట్యూట్ కు వ‌చ్చేయ‌మ‌ని చెప్పాడు. నిజ‌మేన‌ని న‌మ్మిన బాలిక‌.. రోజూ ఉద‌యాన్నే ఏడు గంట‌ల‌కు వెళ్ల‌డంమొద‌లు పెట్టింది.

మూడ్నాలుగు రోజులు వ‌ర్క‌వుట్స్ చేయించిన స‌ద‌రు ఓన‌ర్‌.. ఆ త‌ర్వాత ఓ గ‌దిలోకి తీసుకెళ్లి ఎక్స‌ర్ సైజుల పేరుతో అమ్మాయి ఒంటిపై అస‌భ్యంగా చేతులు వేయ‌డం మొద‌లు పెట్టాడు. వ్వ‌య‌హారం శృతిమించేలా క‌నిపించ‌డంతో బెంబేలెత్తిపోయిన బాలిక‌.. అరుస్తూ బ‌య‌ట‌కు ప‌రుగులు తీసింది.

అనంత‌రం ఇంటికి వెళ్లి, త‌ల్లిదండ్రుల‌కు విష‌యం చెప్పింది. వారు బాధితురాలిని తీసుకొని వెళ్లి, పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, రిమాండ్ కు త‌ర‌లించారు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. ఎవ‌డి నిజస్వ‌రూపం ఏంట‌నేది ఎవ్వ‌రూ గుర్తించ‌లేరు. కాబ‌ట్టి.. అమ్మాయిలు ఆచితూచి వ్య‌వ‌హ‌రించడం త‌ప్ప‌నిస‌రి.