Begin typing your search above and press return to search.
మహారాష్ట్ర అనాథాశ్రమంలో దారుణం జరిగిందా?
By: Tupaki Desk | 4 March 2021 7:30 AM GMTమహారాష్ట్రలోని అనాథాశ్రమంలో దారుణం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
అనాథాశ్రమంలో ఎవరూ లేని అనాథ బాలికల పట్ల కొందరు అధికారులు పశువుల్లా ప్రవర్తించినట్టు బీజేపీ ఎమ్మెల్యే బాంబు పేల్చారు. ఇందులో కొందరు పోలీసులు కూడా ఉన్నట్టు ఆమె ఆరోపించారు.
పోలీసులు, మరికొందరు వ్యక్తులతో కలిసి ప్రభుత్వ హాస్టల్ లోని కొందరు విద్యార్థినీల చేత అసభ్య కార్యక్రమాలు చేయించారన్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బుల్దానా-చిక్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే శ్వేతా మహాలే దీని గురించి మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
మహారాష్ట్రలోని జల్ గావ్ లో ఆశాదీప్ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. కొద్దిరోజుల క్రితం కొందరు పోలీసులు, మరికొందరితో కలిసి హాస్టల్ కు వచ్చి విద్యార్థినులను బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించారని బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆరోపించారు.
ఈ దారునం గురించి ఎన్జీఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకొచ్చారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన వారే రాక్షసులుగా మారారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ విచారణకు ఆదేశించారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరినట్లు సభలో తెలిపారు.