Begin typing your search above and press return to search.
కరోనా: కలిసి పుట్టారు.. కలిసేపోయారు.. అమ్మా నువ్వేదో దాస్తున్నావ్!
By: Tupaki Desk | 19 May 2021 3:04 AM GMTకరోనా మహమ్మారి కరోలు చాస్తూ ఎంతో మంది బతుకులను ఛిద్రం చేస్తోంది. మరెంతో మందిని పొట్టన బెట్టుకుంటుంది. కుటుంబాల ఆధారం, ఆశాదీపాలైన పిల్లలు, మంచి చెడులు చూసే తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఎందరినో పోగొట్టుకుంటున్నారు. చెట్టంత ఇద్దరు కొడుకులను తీసుకుపోయి ఆ దంపతులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది ఈ మహమ్మారి. మీరట్ కు చెందిన గ్రెగరీ రైమండ్ రఫేల్, సోజా దంపతులకు 1997లో జోఫ్రెడ్ వాగేసె గ్రెగరీ, రాల్ఫ్రెడ్ వాగెసే గ్రెగరీ ఇద్దరు కవలలు జన్మించారు. పుట్టిన నాటి నుంచి ఎంతో ఆరోగ్యంగా ఉన్న పిల్లలు... కళ్లముందే ఆరోగ్యంగా ఎదిగారు. ఇద్దరూ ఇంజినీరింగ్ పట్టభద్రులు. మంచి ఉద్యోగాలను పొందారు. కరోనా కారణంగా ఇద్దరికీ ఇంటి నుంచి పని సౌకర్యం లభించింది.
ఇంటి నుంచి పని కావడం వల్ల ఇద్దరూ ఇల్లు చేరారు. ఆ కవలలు ఏప్రిల్ 23న జ్వరంతో బాధపడ్డారు. తొలుత సాధారణ జ్వరం అనుకున్నా ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చారు. ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల మే1న వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. వెంటిలేటర్ లో ఉంచిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత మూడు రోజుల్లోనే అంతా తలకిందులైంది. ఆరోగ్యంగా ఉన్న ఆ ఇద్దరిని చూసిన మహమ్మారికి కన్నుకుట్టింది.
అంతా బాగుంది అనుకున్న సమయంలో జోఫ్రెడ్ ఈ లోకాన్ని విడిచిపోయాడు. బాధ దిగమింగుకున్న ఆ దంపతులు ఈ విషయాన్ని రాల్ ఫ్రెడ్ కు చెప్పకూడదు అనుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ రాల్ ఫ్రెడ్ ను చూడడానికి వెళ్లారు. కానీ రాల్ ఫ్రెడ్ మాత్రం ఏదో సందేహించాడు. అమ్మా... నువ్వేదో దాస్తున్నావ్.. నాకు చెప్పడం లేదు అంటూ సందేహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో వారి బాధ మాటల్లో వర్ణనాతీతం. కానీ కొన్ని గంటల్లోనే రాల్ ఫ్రెడ్ మృత్యు ఒడికి చేరాడు.
చెట్టంత ఎదిగిన కొడుకులు... కలిసి పుట్టి కలివిడిగా పెరిగిన వారు కరోనా కాటుతో రోజు వ్యవధిలో మృతి చెందడం ఆ తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచింది. మొదటి కొడుకు మరణించగానే రెండో కొడుకు కష్టమే అనుకున్నామని వాళ్ల తండ్రి రైమండ్ వాపోయారు. వృతిరిత్యా టీచర్లమైన తాము పిల్లలపై ఎంతో శ్రద్ధ వహించామని చెప్పారు. అందుకనుగుణంగానే మా కలల సాకారం కోసం పిల్లలు ఎంతో కృషి చేశారని యీ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కవలల కంటే ముందు పుట్టిన మరో కొడుకు ఉన్నాడని తెలిపారు. ఆపు అడుగుల ఎత్తు, ఎంతో ఫిట్టుగా ఉన్న వారిని తాము కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. ఎంత కృషి చేసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు.