Begin typing your search above and press return to search.
కేసీఆర్ వెళ్లిన రోజునే ఎంజీఎంలో అలా జరిగిందా?
By: Tupaki Desk | 22 May 2021 2:30 PM GMTషాకింగ్ అంశం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో.. ఆయన వెళ్లిన కాసేపటికే చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగికి ఆక్సిజన్ లేని ఖాళీ సిలిండర్ పెట్టారని.. దీంతో.. ఆక్సిజన్ అందక సదరు రోగి చనిపోయినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో రెండో అతి పెద్ద ఆసుపత్రిగా పేరున్న వరంగల్ ఎంజీఎంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.
స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి అన్ని బ్లాకులు తిరిగి.. రోగులతో మాట్లాడిన రోజే.. ఇలాంటి ఘటన చోటు చేసుకుందని మండిపడుతున్నారు. ఆక్సిజన్ అందక రోగి మరణించిన విషయాన్ని గుర్తించిన బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు మద్యం మత్తులు ఉన్నారని.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు చనిపోతున్నట్లుగా వారు వాపోతున్నారు. మరీ.. అంశాన్ని కేసీఆర్ ఎలా తీసుకుంటారో చూడాలి. ఖాళీ అయిన ఆక్సిజన్ సిలిండర్ ను రోగికి ఎలా పెడతారన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఒక నిండు ప్రాణం పోవటం విషాదానికి గురి చేస్తోంది. మరి.. రోగి బంధువు ఆరోపణల్లో నిజమెంతన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.