Begin typing your search above and press return to search.

ఆమెను ఆఫీసుకు ఓన‌ర్ చేస్తాన‌ని చెప్పొచ్చి.. చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో కూర్చున్నాడు!

By:  Tupaki Desk   |   20 March 2021 9:30 AM
ఆమెను ఆఫీసుకు ఓన‌ర్ చేస్తాన‌ని చెప్పొచ్చి.. చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో కూర్చున్నాడు!
X
అవ‌స‌రం, అవ‌గాహ‌నాలోపం మ‌నిషిని ఎంత వ‌ర‌కైనా తీసుకెళ్తుంద‌ని చెప్ప‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ‌. రోజూ టీవీల్లో, పేప‌ర్ల‌లో స‌వాల‌క్ష నేరాలు జ‌రుగుతూనే ఉంటాయి. అప్ప‌డాలు క‌ర‌క‌రా న‌ములుతూ.. చాయ్ బిస్కెట్టు చ‌ప్ప‌రిస్తూ.. వాటిని చూస్తూనే ఉంటారు. అయినా.. స‌రిగ్గా అలాంటి మోసాల్లోనే ఇరుక్కుపోతుంటారు. ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక అవ‌స్థ ప‌డుతుంటారు!

హైద‌రాబాద్ కు చెందిన‌ ఆమె వితంతువు. భ‌ర్త లేడుకాబ‌ట్టి మ‌ళ్లీ పెళ్లిచేసుకోవాల‌నుకోవ‌డం త‌ప్పుకాదు. ఈ స‌మాజంలో మ‌హిళ‌కు తోడు అవ‌స‌రం కూడా. కానీ.. ఆమె డేటింగ్ సైట్లో త‌న వివ‌రాల‌ను న‌మోదు చేసి, ఓ వ్య‌క్తితో ప‌రిచ‌యం పెంచుకుంది. ఆ రిలేష‌న్ షిప్ కంటిన్యూ చేస్తూ వ‌చ్చింది. అత‌గాడు కూడా.. త‌న‌కు విడాకులైంద‌ని, నిన్ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు. చాలా సంతోష ప‌డింది.

ఏం చేస్తుంటావ‌ని అడిగితే.. బెంగ‌ళూరులోని గేటెడ్ క‌మ్యూనిటీల్లో హౌస్ కీపింగ్ సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నాను. మ‌న‌ది చాలా రిచ్చు కంపెనీ. త్వ‌ర‌లోనే నిన్ను పెళ్లిచేసుకొని, ఆ కంపెనీలో డైరెక్ట్ ర్ ను కూడా చేస్తా అన్నాడు. ఆమె ఇంకా ఆనందప‌డింది. ఓ రోజు.. చిన్న మ‌నీ ప్రాబ్లం వ‌చ్చింది.. కాస్త సెట్ చేస్తావా? అన్నాడు. నువ్వు నా జీవితాన్నే సెటిల్ చేయ‌బోతున్నావు.. ఈ మాత్రం సెట్ చేయ‌లేనా.. అని అడిగినంత ఇచ్చింది. మ‌రోసారి ఇంకేదో చెప్పాడు.. ఇలా మొత్తం రూ.3 ల‌క్ష‌లు తీసుకున్నాడు.

పెళ్లి ఎప్పుడంటే త‌ప్పించుకు తిరుగుతున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయ‌ట్లేదు.. చాటింగులో మీటింగూ లేదు. అప్పుడు డౌట్ వ‌చ్చింది ఆమెకు.. వీడెవ‌డో ఉల్ఫా బ్యాచ్ గాడ‌ని! వ‌చ్చి హైద‌రాబాద్ లోని రాచ‌కొండ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అత‌గాడు బెంగ‌ళూరుకు చెందిన రాజ్ వ‌న్స్. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగిపోయాడు.. మైనింగ్ బిజినెస్ లో తేలిపోయాడు. ఆ త‌ర్వాత ఈమెను ముంచేశాడు. ఇప్పుడు చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో చిప్ప‌కూడు తింటున్నాడు. అన్న‌ట్టూ.. ‘‘ఆమెను ఆఫీసుకు ఓన‌ర్ చేస్తాన‌ని చెప్పొచ్చి.. చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో కూర్చున్నావేంటీ?’’ అని అడిగితే ఏం చెప్తాడో..!!