Begin typing your search above and press return to search.
టిక్ టాక్ పరిచయంతో ఫోటోలు..వేరే వారితో పెళ్లి వేళ కొత్త టెన్షన్
By: Tupaki Desk | 29 March 2021 3:30 PM GMTగతంలో ఇద్దరి మధ్య పరిచయం జరగాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. అపరిచితులు.. సంబంధం లేని ప్రాంతాలకు చెందిన వారు సైతం చిటికెలో పరిచయం చేసుకోవటమే కాదు.. గంటల్లో వాట్సాప్ వీడియో కాలింగ్ వరకు వచ్చేస్తున్నారు. ఈ వేగవంతమైన పరిచయాలు కొత్త చిక్కుల్ని.. చికాకుల్ని.. సమస్యల్ని తెచ్చి పెడుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో పరిచయాలు మహా వేగంగా మారిపోతున్నాయి. దీంతో మంచి కంటే చెడు ఎక్కువగా చోటు చేసుకుంటుంది. కుకట్ పల్లిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం చూస్తే.. ఇదెలానో అర్థమవుతుంది.
కుకట్ పల్లికి చెందిన కల్యాణ్ కారు వాషింగ్ సెంటర్ లో పని చేస్తుంటాడు. టిక్ టాక్ యాప్ వాడకంలో ఉన్న వేళలో.. ఒక అమ్మాయిని ఫాలో అయ్యేవాడు. ఆమె చేసే వీడియోలకు అదే పనిగా లైకులు కొట్టేవాడు. ఆమెతో పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు. ఆమె నుంచి సానుకూల స్పందనతో వారిద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు.
అనంతరం వారు తరచూ చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో ఆమె కాలేజీ వద్దకు వెళ్లిన కల్యాణ్.. ఆమెతో మరింత స్నేహంగా ఉంటూ చనువును పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతితో సెల్ఫీలు తీసుకున్నాడు. ఆమె చనువుగా ఉండటంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే..ఆ యువతి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు.
తాజాగా ఆ అమ్మాయికి వేరే వారితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుుకున్న అతను..తన వద్ద ఉన్న పాత ఫోటోలతో బ్లాక్ మొయిల్ చేయటం మొదలు పెట్టాడు. దీంతో.. ఆమె రాచకొండ పోలీసుల్నిఆశ్రయించింది. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. కొత్తవారితో పరిచయాల్ని ఆపుకోమని చెప్పటం లేదు కానీ.. తొందరపడిపోవటం.. ఫోటోలు తీసుకోవటం లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. లేకుంటే అనవసరమైన చిక్కులు తప్పవు.