Begin typing your search above and press return to search.
వివాహేతర సంబంధం అనుకున్నారు.. ఆమెతో మాట్లాడుతుండగా పట్టుకొని కట్టేశారు. కానీ!
By: Tupaki Desk | 6 April 2021 3:20 AM GMTభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ హైడ్రామా నెలకొంది. హోం గార్డు ఓ మహిళతో మాట్లాడుతుండగా ఆయన కుటుంబ సభ్యుల దాడికి దిగారు. వద్దని ఆయన వారించినా ఆమెను కట్టేసే విచక్షణారాహిత్యంగా దాడి చేశారు. అతడికి, తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు.
అనుమానమేనా?
ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఓ కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇటీవల ఇంటికి సరిగా వెళ్లకపోవడంతో అతడు వేరే వారితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆదివారం నాడు హోంగార్డు స్థానికంగా ఉన్న ఓ మహిళ ఇంటికెళ్లారు. తమ అనుమానమే నిజం అనుకున్నారు. ఆమెతో మాట్లాడుతుండగా అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు.
కిటికీకి కట్టేశారు!
ఆమెతో ఎటువంటి సంబంధం లేదని హోం గార్డు చెప్పినా వినకుండా వారు ఆమెపై దాడి చేశారు. అతన్ని పక్కకు తోసేసి దాడి చేశారు. తాడుతో కటికీకి కట్టేశారు. అంతేకాకుండా తమ కుమారుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అతడి జీవితం నాశనం చేస్తున్నావని దుర్భాషలాడారు. స్థానికులెవరూ ఆమెకు అండగా నిలవకపోవడం గమనార్హం.
నాకేం తెలియదు..
తనకు వారి కుమారుడికి ఎటువంటి సంబంధం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఓ దుకాణంలో పని చేస్తూ ఒంటరిగా జీవనం వెల్లదిస్తున్నానని వాపోయారు. తన దగ్గర డబ్బులు తీసుకోని అతడు వేరే వాళ్లకు అప్పులు ఇస్తాడని తెలిపారు. కాగా ఇప్పుడు అందుకే వచ్చారని వివరించారు. ఆ క్రమంలోనే విచక్షణారాహిత్యంగా తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల జోక్యం
పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హైడ్రామా జరుగుతోందని తెలియగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చి వివరాలు ఆరా తీశారు. ఇరు వర్గాలతో మాట్లాడారు. కాగా చివరకు సర్ది చెప్పారు. దాంతో ఈ హైడ్రామాకు తెర పడింది. అనుమానంతో ఆ హోం గార్డు కుటుంబసభ్యులు చేసిన దాడిలో ఆ బాధితురాలు స్వల్పంగా గాయపడ్డారు.