Begin typing your search above and press return to search.
దేవుళ్ల పటాల ముందు నరబలి... అందుకే అలా చేసిందట , వెలుగులో షాకింగ్ నిజాలు!
By: Tupaki Desk | 17 April 2021 6:30 AM GMTమూఢనమ్మకాల పిచ్చి తో కన్న బిడ్డలనే బలి ఇస్తున్న ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనూ రెండు రోజుల క్రితం ఓ వివాహిత తన చంటిబిడ్డను నరబలి ఇచ్చింది. ఈ ఘటన కి సంబంధించిన కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఈడీ చదువుకున్న ఆ మహిళ , ఎవరో ఏదో దోషం ఉందని చెప్తే గుడ్డిగా నమ్మేసి, ఆ దోషం పోగొట్టుకోవడానికి ఏకంగా కన్న బిడ్డనే బలి ఇచ్చింది ఆ కర్కోటకరాలు. సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాడు తండాకు చెందిన భారతికి ఆరేళ్ల క్రితం మొదటి వివాహం జరిగింది. విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత భారతి ,కృష్ణ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఆర్నెళ్ల క్రితం ఓ పాప పుట్టింది.
అయితే భారతికి నాగ దోషం ఉందని ఓ వ్యక్తి చెప్పడంతో అప్పటినుంచి ఆమె మానసిక స్థితిలో మార్పు వచ్చింది. ఆమె కోలుకోవాలని పలు ఆలయాలు,చర్చిలు,దర్గాలకు తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. ఆ తర్వాత ఎవరో చెప్పిన కొన్ని అంశాలని , అలాగే యూట్యూబ్ లో చూసి పూజలు చేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారికి అగర్బత్తీల వాసన వచ్చి రోజూ ఏం పూజలు చేస్తున్నావని ప్రశ్నిస్తే ‘మీకేం అవసరం. దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా’అని ఎదురు సమాధానం చెబుతుండడంతో వారు కూడా మిన్నకుండిపోయారు. ఈ విషయాన్ని భర్త కృష్ణ కూడా గమనిస్తూ వస్తున్నాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కూతురు రీతును జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
గురువారం కృష్ణ ఏదో పని నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రానికి వెళ్లాడు. భార్య ప్రవర్తన గురించి తెలుసు కాబట్టి, వెళ్లేటప్పుడు అత్త, మామలకు చెప్పి మరీ వెళ్లాడు. ఇంటికి వెళ్లి తాను వచ్చేవరకూ పాపను చూసుకోవాలని చెప్పాడు. అయితే వారు వెళ్లడం కాస్త ఆలస్యం కావడంతో ఈ మధ్యలోనే ఘోరం జరిగిపోయింది. దేవుళ్ల చిత్రపటాల ముందు బిడ్డను ఉంచి పూజలు చేసిన భారతి, ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత స్థానికులు ప్రశ్నిస్తే అసలెందుకు హత్య చేశానో తనకే తెలియదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అభంశుభం తెలియని పసిబిడ్డ రీతును గొంతుకోసి హత్య చేసిన భారతిని తండానుంచి వెళ్లగొట్టండి. నా మనుమరాలిని హత్య చేసింది. రేపు నా కొడుకును, నన్ను హత్య చేయదని గ్యారటీ ఏమిటీ అని ఆమె అత్త కన్నీరు మున్నీరు అవుతుంది.