Begin typing your search above and press return to search.
మాయదారి కరోనా ఎంత పని చేసింది? తల్లి.. చెల్లి రారని తెలియని స్థితిలో అతడు
By: Tupaki Desk | 26 April 2021 11:30 AM GMTగుడెలు పిండేసే ఘటనలు వరుస పెట్టి చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా చోటు చేసుకుంటున్న ఉదంతాలకు కన్నీళ్లకు సైతం అలసట వస్తోంది. విన్నంతనే ఉలిక్కిపడే ఈ ఉదంతంలోకి వెళితే.. ఇలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదు దేవుడా అని ప్రార్థించే పరిస్థితి. అంతకు మించి ఇంకేమీ చేయలేని దయనీయ ఉదంతంగా దీన్ని చెప్పాలి.
నిర్మల్ జిల్లాలోని రాంటేక్ గ్రామంలో 75 ఏళ్ల లక్ష్మీ బాయ్ కు నలుగురు కొడుకులు.. ఒక కూతురు. కొడుకు గిరిధర్ కు మతిస్థిమితం సరిగా ఉండదు. దీంతో.. తల్లి వద్దే ఉంటాడు. సుమారు పది రోజుల క్రితం లక్ష్మీ అనారోగ్యానికి గురి కావటంతో.. ఆమెకు సపర్యలు చేసేందుకు కుమార్తె భారతి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక వైద్యుడి సలహాతో వైద్యం చేయించుకుంటున్నారు. నాలుగు రోజులుగా ఇంటి వద్ద అలికిడి లేకపోవటం.. ఇంటి నుంచి దుర్వాసన రావటంతో అనుమానించిన గ్రామస్తులు.. ఇంట్లోకి వెళ్లి చూశారు.
ముగ్గురు అచేతనంగా పడి ఉండటం.. అందులో లక్ష్మీ.. ఆమె కుమార్తె దేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వణికిన గ్రామస్తులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా.. లక్ష్మీ.. ఆమె కుమార్తె మరణించారని.. కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడ్నిఆసుపత్రికి తరలించారు.
ఈ ముగ్గురు కరోనా బారిన పడి ఉంటారని.. అనారోగ్యంతో వారిద్దరు మరణించి ఉంటారని భావిస్తున్నారు. గిరిధర్ అస్వస్థతతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. వారం రోజులుగా చనిపోయిన వారితోనే.. అలానే ఉన్న వైనం షాకింగ్ కు గురి చేస్తోంది. కరోనా నేపథ్యంలో డెడ్ బాడీల్ని బయటకు తీసేందుకు గ్రామస్థులు సాహసించకపోవటతో మున్సిపల్ సిబ్బంది సాయంతో అంత్యక్రియల్ని పూర్తి చేశారు. కరోనా కారణంగా చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలకు ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పక తప్పదు.