Begin typing your search above and press return to search.
ఒకరికి తెలీయకుండా మరొకరు .. ఒకే కుటుంబంలో కరోనా తో ముగ్గురు బలి !
By: Tupaki Desk | 22 May 2021 8:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారి జోరు దేశంలో కొనసాగుతుంది. దేశంలో ప్రతి రోజూ లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు , వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక దేశంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అత్యంత బాధాకరంగా ఉన్నాయి. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారు. భర్త,భార్య , కొడుకు ముగ్గురు కరోనా కాటుకి బలైయ్యారు. అయితే , ఈ ముగ్గురు చనిపోయినట్టు వారికి తెలియదు.
వివరాల్లోకి వెళ్తే .. మంచిర్యాల జిల్లా ,దండేపల్లి మండలం తాళ్లపేటలో ఓ కుటుంబాన్ని కరోనా నాశనం చేసింది. పదిహేను రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. భర్త మృతి విషయం భార్యకు తెలియదు.. భార్య మరణం విషయం భర్తకు తెలియదు.. వీరిద్దరి మరణం కుమారుడికి తెలియదు. కుమారుడు లేడనే విషయం తల్లిదండ్రులకూ అసలే తెలియదు. ఒకరి మరణ వార్త మరొకరికి తెలియకుండా అందరూ చనిపోయారు. రిటైర్డ్ సింగరేణి కార్మికుడు అక్కనపెల్లి కుమారస్వామి, ఆయన భార్య భూలక్ష్మీ , కుమారుడు రఘు గత పదిహేను రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దీంతో తండ్రీకొడుకులు కరీంనగర్ ఆస్పత్రిలో చేరారు. తల్లి తాళ్లపేటలో హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంది. ఆసుపత్రిలో చేరిన మూడు రోజులకే రఘు ఈ నెల 9న మృతిచెందాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. అతను మృతిచెందిన మరుసటి రోజే హోం ఐసోలేషన్‌లో ఉన్న తల్లి భూలక్ష్మీ ఈ నెల 10న మృతిచెందింది. వీరిద్దరు మృతిచెందిన విషయం కుమారస్వామికి తెలియదు. తీరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు కూడా గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. తక్కువ సమయంలోనే ముగ్గురు మృతి చెందడంతో తాళ్లపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది.