Begin typing your search above and press return to search.
ఐసీయూ బెడ్ మీదే తాళి కట్టాడు.. కట్ చేస్తే కడలిని మించిన విషాదం
By: Tupaki Desk | 31 May 2021 4:17 AM GMTఎన్నో కుటుంబాల్ని కాటేసింది మాయదారి మహమ్మారి. బంధాలకు.. అనుబంధాలకు ప్రశ్నలుగా మారటమే కాదు.. ఎన్నో విషాద ఉదంతాలకు కేరాఫ్ గా నిలిచింది కరోనా. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. అంతులేని శోకాన్ని మిగిల్చిన ఈ ఉదంతం గురించి విన్న వారంతా అయ్యో అనుకోకుండా ఉండలేరు. సినిమాటిక్ లా ఉండే ఈ ఉదంతం.. చివరకు విషాద ఉదంతంగా మారటం కదిలించేస్తుంది. అసలేం జరిగిందంటే..
సంగారెడ్డి శివారు ప్రాంతానికి చెందిన 27 యువతి.. మాంచి ఉద్యోగం చేస్తున్న యువకుడు ప్రేమించుకున్నారు. మూడేళ్లుగా సాగుతున్న వారి ప్రేమకు కామా పెట్టి.. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమ భవిష్యత్ జీవితం గురించి వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఆమెకు కరోనా సోకింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. తాను అమితంగా ప్రేమించే యువతి కోసం ఆ యువకుడు విపరీతంగా తపించాడు. ఆమెకు ఎంతో ధైర్యం చెబుతూ బతికించే ప్రయత్నం చేశాడు.
అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించటంతో వైద్యులు ఆమెకు వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారు. వైద్యుల అనుమతితో వెంటిలేటర్ మీద ఉన్న యువతితో మాట్లాడిన యువకుడు.. ఆమెలో ధైర్యం పెంచేందుకు.. బతుకు మీద మరింత భరోసా కలిగించేందుకు.. కరోనాను జయించేందుకు వీలుగా ఐసీయూ మీద ఉన్న ఆమెకు తాళి కట్టాడు. త్వరగా కరోనా నుంచి బయటపడు.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఘనంగా పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆ అమ్మాయి విపరీతమైన ఆనందానికి గురైంది.
సినిమాలో అయితే.. ఈ కథకు ముగింపు మరోలా ఉండేదేమో? కానీ రీల్ కు రియల్ కు మధ్య తేడా చాలానే ఉంటుంది కదా? ఈ ఉదంతంలో కూడా అలాంటిదే చోటు చేసుకుంది. కరోనాను జయించాలని ప్రయత్నించిన ఆమె.. ఆ పోరాటంలో ఓడింది. ప్రాణాల్ని విడిచింది. ఆమెను అమితంగా ప్రేమించిన యువకుడు.. ఆ అమ్మాయి సోదరుడు ఇద్దరు తన్నుకొస్తున్న దు:ఖాన్ని అదిమి పెట్టుకొని ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషాద ఉదంతంలో మరో షాకింగ్ అంశం ఏమంటే.. తమ కుమార్తె మరణించిన విషయం ఇప్పటికి తల్లిదండ్రులకు తెలీదు. వారి ఆరోగ్యం సరిగా లేనందున.. కూతురు మరణించిన విషయాన్ని వారికి చెప్పలేక తల్లడిల్లుతున్నారు. పాపిష్టి కరోనా.. ఇలా ఎంత మంది ఉసురు తీసిందో?