Begin typing your search above and press return to search.

బట్టతల దాచిపెళ్లి పెళ్లి.. ఆ భార్య ఏం చేసిందంటే?

By:  Tupaki Desk   |   5 March 2021 5:33 AM GMT
బట్టతల దాచిపెళ్లి పెళ్లి.. ఆ భార్య ఏం చేసిందంటే?
X
పెళ్లి కోసం నానా అబద్ధాలు ఆడుతుంటారు.. ‘ఒక్క పెళ్లి వంద అబద్దాలు ఆడినా తప్పులేదంటారు’. అలా చాలా మంది తమలోని లోపాలను కప్పిపెట్టి పెళ్లి చేసుకుంటారు. అది బయటపడ్డాక గొడవలు మొదలవుతాయి. అయితే పెళ్లి చేసుకున్న పాపానికి చాలా మంది భరిస్తుంటారు.

తాజాగా అలాగే బట్టతలను దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నాడంటూ ఓ భార్య కోర్టుకు ఎక్కింది. విడాకులు కావాలని కోరింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఈ విషయం వెలుగుచూసింది.

విగ్ పెట్టుకొని పెళ్లి పీటలెక్కిన తనను మోసగించడాని భర్తపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది భార్య. పెళ్లికి ముందు మునుపు భర్తకు ఒత్తుగా జుట్టు ఉందని.. పెళ్లి తర్వాత అతడి నిజస్వరూపం బయటపడిందని పేర్కొంది.

తాజాగా ఆ కొత్త దంపతులకు మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం లేదని భార్య తెలిపింది. భర్త బట్టతల కారణంగా తన స్నేహితుల ముందు పరువు పోతోందని ఆమె పేర్కొంది.ఎవరెన్ని చెప్పినా తనకు విడాకులు కావాలని పట్టుబట్టింది. దీంతో మరోమారు కౌన్సిలింగ్ కు రావాలని పోలీసులు తిప్పి పంపించారు.

ఈ జంటకు జనవరి 2020లో వివాహమైంది. గత ఏడాది ముంబైకి చెందిన మరో యువతి కూడా ఇదే కారణంతో విడాకులు కోరింది. బట్టతల దాచిపెట్టి తనను మోసగించాడని ఆరోపిస్తూ ఆమె విడాకుల కోసం కోర్టుకెక్కింది. భర్త తనను కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.