Begin typing your search above and press return to search.
విశాఖలోని లగ్జరీ ప్లాట్ లో దారుణ హత్యలు.. కొడుకేనా చేసింది?
By: Tupaki Desk | 16 April 2021 4:31 AM GMTప్రశాంత నగరాల్లో ఒకటిగా చెప్పే విశాఖపట్నంలో ఇటీవల కాలంలో అనూహ్య రీతిలో హింసాత్మక ఘటనలుచోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా హత్యలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటిదే ఒకటి సంచలనంగా.. మరింత మిస్టరీగా మారింది. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం కన్న కొడుకే కాలయముడయ్యాడు. తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకోవటమే కాదు.. తమ్ముడ్ని చంపి.. అనూహ్య పరిణామాలతో అతడూ చనిపోయినట్లుగా భావిస్తున్నారు.
విశాఖ శివారులోని మధురవాడ మిథిలాపురి కాలనీ ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లగ్జరీ అపార్ట్ మెంట్ గా పేరుంది. ఇందులో సి బ్లాక్ లోని 505 ప్లాట్ లో యాభై ఏళ్ల బంగారు నాయుడి కుటుంబం నివాసం ఉంటోంది. 20 ఏళ్లు బహ్రెయిన్ లో ఉండి.. మూడేళ్ల క్రితమే విశాఖకు వచ్చారు. ఆయన సతీమణి 45 ఏళ్ల నిర్మల హోమియో వైద్యురాలిగా అందరికి సుపరిచితురాలు. పెద్ద కొడుకు పాతికేళ్ల దీప్ వరంగల్ నిట్ లో ఇంజినీరింగ్ చేసి.. ఢిల్లీలో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న కొడుకు కశ్యప్ (19) ఇంటర్ చదువుతున్నాడు.
గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బంగారునాయుడి ప్లాట్ నుంచి అరుపులు వస్తున్నట్లుగా ఒక మహిళ అపార్ట్ మెంట్ వాట్సాప్ గ్రూపులో పోస్టు పెట్టారు. దీంతో సెక్యురిటీ సిబ్బంది వెళ్లి.. అలాంటిదేమీ లేదని తిరిగి వచ్చారు. తిరిగి తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో సదరు ప్లాట్ నుంచి పొగ వస్తున్నట్లుగా గుర్తించి.. తలుపు కొట్టారు. ఎవరూ స్పందించకపోవటంతో.. తలుపులు బద్దలు కొట్టారు. లోపలున్న సీన్ చూసి షాక్ తిన్నాడు.
బంగారు నాయుడు.. అతడి భార్య.. చిన్న కొడుకు దారుణంగా హత్యకు గురి కావటం.. పెద్ద కొడుకు సూటు.. టై కట్టుకొని ముస్తాబైన అతను ఊపిరి ఆడక మరణించినట్లు గుర్తించారు. ఇతడి తప్పించి.. మిగిలిన అందరి శరీరం మీదా గాయాలు ఉండటం గమనార్హం. బంగారు నాయుడి శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. ఆయన పారిపోవటానికి ప్రయత్నించి మరణించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
ఇంట్లోని ముగ్గురి ఒంటిపై గాయాలు ఉండగా.. పెద్ద కొడుకు దీపక్ మాత్రం సూట్.. టై ధరించి ఉన్నాడు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం తండ్రి.. తల్లి.. తమ్ముడ్ని హతమార్చి వారిని తగులబెడదామన్న ఉద్దేశంతో ఇంట్లో నిప్పు అంటించి ఉంటాడని.. పొగ తీవ్రంగా రావటంతో ఉక్కిరిబిక్కిరి అయి.. అతడు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫ్లాట్లో మంటలు రావటంతో.. ఫైర్ సిబ్బంది నీటిని పెద్ద ఎత్తున కొట్టటంతో కీలకమైన సాక్ష్యాలు చెల్లాచెదురైనట్లుగా చెబుతున్నారు.
హత్యలకు కారణమైనట్లుగా భావిస్తున్న దీపక్ తెలివైన వాడిగా చెబుతున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి కూడా ఎంపికైనట్లు చెబుతున్నారు.హత్యలకు కారణం ఏమిటన్నది అర్థం కావట్లేదని.. కుటుంబ కలహాలు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అపార్ట్ మెంట్ మొత్తం సీసీ కెమేరాలు ఉండటం.. ప్లాట్ లో మాత్రం కెమేరాలు లేకపోవటంతో.. బయటవారు లోపలకు వచ్చి హత్య చేసే అవకాశం లేదని.. ఇంట్లోనే జరిగిన గొడవతోనే హత్యలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. చిక్కుముడలతో ఏ మాత్రం అర్థం కానట్లుగా ఉన్న ఈ హత్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.