Begin typing your search above and press return to search.

రేపే పెళ్లి.. వధువుతో పాటుగా కుటుంబం మొత్తం ఆత్మహత్య

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:53 AM GMT
రేపే పెళ్లి.. వధువుతో పాటుగా కుటుంబం మొత్తం ఆత్మహత్య
X
తెల్లారితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ నవ వధువు వల్లకాటికి పయనమైంది. ఆ పెళ్లి కూతురు మాత్రమే కాదు , మొత్తం ఆ కుటుంబమే బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికుల్ని కలచివేస్తోంది. అసలు ఈ ఆత్మహత్యలకు కారణం ఏంటి అంటే ? ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ , ఆమె కూతుళ్లు రాధిక , రమ్య బుధవారం అర్థరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందమ్మది నిరుపేద కుటుంబం. దీనికి తోడు ఆమె భర్త ఏ పని చేయకపోవడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్ల పెళ్లీడుకు వచ్చారు. అయితే పెద్దకూతురుకు ఇటీవల వివాహం ఖాయమైంది.

ఈ నెల 11న వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. అయితే ఓ పెళ్లి సమయం దగ్గర పడడం.. మరో వైపు ఎక్కడా డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో ఆ తల్లీకూతుళ్లు కుంగి పోయారు. దీతో తీవ్ర మనస్తాపం చెంది బుధవారం అర్థరాత్రి సమయంలో బంగారం శుభ్రం చేసేందుకు వినియోగించే కెమికల్ తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా పెను విషాదం నింపింది. ఒకేసారి కుటుంబంలో ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికుల్ని కలచివేసింది.
Tags: