Begin typing your search above and press return to search.

దావూద్ ఇబ్రహీంతో లింకులా? మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్

By:  Tupaki Desk   |   23 Feb 2022 11:30 AM GMT
దావూద్ ఇబ్రహీంతో లింకులా? మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్
X
మహారాషట్్ర మంత్రి నవాబ్ మాలిక్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ ‘ఈడీ’ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ తో సంబంధం ఉందనే ఆరోపణలతో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏడుగంటల పాటు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు.

మనీలాండరింగ్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ ను కొద్దిరోజుల క్రితమే నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసింది. కస్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాలిక్ ను అదుపులోకి తీసుకుంది ఈడీ. దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్ ను ఈడీ అదికారులు అంతకుముందు ఆయనను తీసుకెళ్లి విచారించారు.

అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దావూద్ గ్యాంగ్ తోపాటు ఇతర మాఫియా ముఠాల నుంచి నవాబ్ మాలిక్ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను లొంగబోనని అరెస్ట్ తర్వాత స్పందించారు నవాబ్ మాలిక్.

బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మాలిక్. ఉదయం 7 గంటలకు విచారణ చేపట్టారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బంధువుతో ఉన్న సంబంధాలపై మంత్రిని విచారించినట్టుగా తెలుస్తోంది.

దావూద్ అక్రమ ఆస్తులు, కొద్దిరోజుల క్రితం అరెస్ట్ అయిన దావూద్ సోదరుడు ఇబ్రహీం కస్కర్ తో సహా పలు అనుమానిత నిందితులకు సంబంధించిన సంబంధాలపై ఈడీ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.

కాగా దావూద్, అతడి అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశఈలించిన ఈడీ ఏకంగా మహారాష్ట్రమంత్రిని అరెస్ట్ చేసి అక్కడి శివసేన సర్కార్ కు షాకిచ్చింది.

అరెస్ట్ అయిన నవాబ్ మాలిక్ ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుఖ్ కుమారుడికి మద్దతుగా నిలిచాడు. కేంద్ర డ్రగ్స్ వ్యతిరేక సంస్థ పోలీస్ డైరెక్టర్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే మరో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇతడిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది.