Begin typing your search above and press return to search.

తిరుమల వెళ్లే వారికి ఇది షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   1 July 2019 9:20 AM GMT
తిరుమల వెళ్లే వారికి ఇది షాకింగ్ న్యూస్
X
ఒకప్పుడు ఇంటికో చెట్టు ఉండేది. పల్లెలన్నీ పచ్చటి తోరణాలయ్యేవి. ఎటూ చూసినా పచ్చదనం పరిఢవిల్లేది. కానీ ఇప్పుడు చెట్లు కొట్టేస్తున్నారు. ఇంటి చుట్టు చెట్టు కాదు కదా మొక్కలు కూడా లేకుండా కాంక్ట్రీట్ జంగల్ అలుముకుంటోంది. అందుకే ఎండలు, వానలు, చలి గతి తప్పి ఏవీ ఎప్పుడు పడుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉపాధ్ఘాతం అంతా కలుషితమవుతున్న మన ప్రకృతి గురించిన విశ్లేషణే..

ఏడు కొండలతో కొలువైన తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధానం, గుట్టలు అంతా పచ్చటి కోక పరుచుకుంటుంది. అక్కడి చల్లటి ఆహ్లాదకర వాతావరణాన్ని అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు తాజాగా బయటపడ్డ ఒక రిపోర్టు తిరుమల-తిరుపతిలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. హైదరాబాద్ కంటే కూడా తిరుపతి ప్రమాదమని తేల్చి చెబుతోంది.

తాజాగా కాలుష్య నియంత్రణ మండలి ఈ మధ్యన తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్డుపై ‘సెంటర్ ఫర్ ఎయిర్ టాక్సిక్ మెటల్స్ మానిటర్స్’ను ఏర్పాటు చేసింది. ఇది వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని లెక్కగడుతుంది. ఈ ఏడాది తిరుమలలో నమోదైన కాలుష్య తీవ్రత చూసి అధికారులే షాకయ్యారు.

తిరుమలకి నిత్యం 1500 ఆర్టీసీ బస్సులతో వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు కొండపైకి వెళుతుంటాయి. ఇవన్నీ కలిపి ఎనిమిది రకాల విషయవాయువులను వెదజల్లుతున్నాయనట.. ఇందులో అత్యంత విషపూరిత నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఉంటుందని తేలింది. ఇది మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే వాయువు. ఈ వాయువు తిరుమలలో ఏకంగా 100 మైక్రోగ్రామ్స్ కు పైగా నమోదైంది. ఇది ట్రాఫిక్ అధికంగా ఉండే హైదరాబాద్, విజయవాడల్లో కేవలం 60 మైక్రోగ్రామ్స్ మాత్రమే ఉంది. ఇక తిరుమల బెంజీన్ విషవాయువు 1.60 మైక్రోగ్రామ్స్ ఉంటే.. హైదరాబాద్ లో 0.76 గ్రాములు మాత్రమే ఉంది. దీంతో హైదరాబాద్ కంటే కూడా విషవాయువులు ఎక్కువగా విడుదలవుతున్న ప్రాంతంగా తిరుమల-తిరుపతి నిలుస్తోంది. అంటే అక్కడికి వెళితే మన ప్రాణాలకు మనమే ముప్పు తెచ్చుకున్నట్టే. మరి దీనికి ఉపాయంగా విద్యుత్ వాహనాలు లేదా.. రైలు ఫెసిలీటీ తిరుపతి-తిరుమలలో ఏర్పాటు చేస్తే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.