Begin typing your search above and press return to search.

కేసీఆర్, ఉద్యోగాల కల్పన.. కేంద్రం బ్రేక్

By:  Tupaki Desk   |   6 March 2020 3:30 PM GMT
కేసీఆర్, ఉద్యోగాల కల్పన.. కేంద్రం బ్రేక్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకటి అనుకుంటే కేంద్రం మరోటి చేసింది. టీ సర్కారు ఉద్యోగాల కల్పనకు గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణలో కొత్త జోన్ లను ఏర్పాటు చేసి కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా... వాటిని ఆమోదించకుండా కేంద్రం బ్రేక్ వేసింది. ఫైలును నిలిపివేసి కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది.

తెలంగాణలో 33 జిల్లాలను ఏడు జోన్లుగా కేసీఆర్ ఏర్పాటు చేశారు. రెండు మల్టీజోన్లుగా ప్రతిపాదించారు. రాష్ట్రపతి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ 2018 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రపతి డిసెంబర్ లో ఆమోదం తెలిపారు. అయితే అదనంగా రెండు జిల్లాలు ములుగు, నారాయణ ఏర్పడడం ... వికారాబాద్ ను చార్మినార్ జోన్ లోకి మార్చడం.. చేసి కేంద్రానికి పంపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరారు. ప్రభుత్వ, జిల్లా టీచర్లను కలుపుతూ ఏకీకృత సర్వీసులను పేర్కొన్నారు. ఈ అంశం వివాదాస్పదమైంది.

ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టుకెక్కారు. దానిపై కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఈ వివాదాస్పద క్లాజును తొలగిస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాని కి తెలియజేసింది. అయితే హైకోర్టులో కేసు తేలే వరకు తాము ఈ కొత్త జోన్ల మార్పును అంగీకరించమని కేంద్రం తాజాగా తెలిపింది. దీంతో జోన్స్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిద్దామనుకున్న కేసీఆర్ ఆశలకు బ్రేక్ పడింది. ఇప్పుడు జోనల్ వ్యవస్థతో ఉద్యోగాలు కల్పించడం.. నోటిఫికేషన్లు విడుదల చేయాలనుకున్న ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది.