Begin typing your search above and press return to search.

తక్కువగా నిద్రపోయే వాళ్లకు షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   5 Nov 2021 4:31 AM GMT
తక్కువగా నిద్రపోయే వాళ్లకు షాకింగ్ న్యూస్
X
కాలం మారింది.. కాలంతోపాటు మనిషి మారాడు.. ఇప్పుడు రాత్రి 1, 2,3 గంటలైన నిద్రపోని వారు ఎంతో మంది.. స్మార్ట్ ఫోన్లో పడి రాత్రంతా జాగారం చేసే యువత కోకోల్లలు. నిద్రలేమీ ఇప్పుడు అందరికీ ప్రధాన సమస్యగా మారింది. కాలక్షేపం కోసం రాత్రుళ్లు ఫోన్లో మునిగిపోతే తెల్లవారుజాము వరకూ దాని నుంచి బయటపడిన వారు ఎందరో.. ఫోన్లు, టీవీల వల్ల ఈ కాలంలో చాలామంది కంటినిండా నిద్ర పోవట్లేదు. అలాంటి వారికి వాషింగ్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు షాకింగ్ విషయం చెప్పారు.

సరైన నిద్రలేకపోవడం వల్ల మెదడుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని నిర్ధారించారు. తద్వారా ఆలోచన శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని.. గందరగోళంగా ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు 7.30 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం మంచిదని చెబుతున్నారు.

నిద్రలేమీతో భయంకర వ్యాధులు చుట్టుముడుతాయని అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. వీరు అధ్యయనంలో భాగంగా 15 మంది యువకులను పదిరోజుల పాటు రోజు 5 గంటలకు మించి నిద్ర పోనివ్వలేదు. అనంతరం వారి శరీరంలో పరీక్షించగా.. గ్లూకోజ్, కొవ్వు పదార్థాల స్థాయి పెరిగింది. అంతేకాదు.. జీవక్రియల రేటు ఒక్కసారిగా హెచ్చుతగ్గులకు గురికావడాన్ని గుర్తించారు.

ఈ నిద్రలేమీ కారణంగా జీవక్రియ దెబ్బతిని గ్లూకోజ్, కొవ్వు పదార్థాల స్థాయి పెరిగి షుగర్, స్థూలకాయం వంటి సమస్యలు దాపురిస్తాయని తేల్చారు. సో 5 గంటల నిద్రతో ఎన్నో అనర్థాలని కనీసం 8 గంటలు నిద్ర తక్కువ కాకుండా చూసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మీరు డయాబెటిస్ తోపాటు లావెక్కుతున్నారంటే అది ఖచ్చితంగా నిద్రలేమీతో వచ్చిందని హెచ్చరిస్తున్నారు..

రోజూ రాత్రి కనీసం ఏడుగంటలు నిద్ర లేకుంటే కుంగుబాటు, ఆందోళన ముప్పు 80శాతం పెరుగుతుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. దీనిలో కనీసం గంట పాటు నిద్ర తక్కువైనా నీరసం, నిస్సత్తువ, అలసట వహించే ప్రమాదం 60 నుంచి 80శాతం వరకూ ఉంటుందని వెల్లడించింది.