Begin typing your search above and press return to search.
మనుషులను చంపేస్తున్న ఒమిక్రాన్.. డేంజర్ అన్న డబ్ల్యూహెచ్ఓ
By: Tupaki Desk | 7 Jan 2022 11:30 AM GMTకరోనా కొత్త రకం ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో రోజుకు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. యూరప్ లోనూ అదేపరిస్థితి. ఇప్పుడు భారత్ లోనూ ఈ మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది. దాంతోపాటు కేసుల సంఖ్యను విపరీతంగా పెంచేసింది. నిన్న లక్షకు పైగా కేసులు నమోదు కావడం తీవ్రతకు అద్దం పడుతోంది.
కరోనా వేరియంట్లు అన్నింట్లోకి ఒమిక్రాన్ తో ప్రాణాపాయం లేదని వస్తున్న వార్తలపై తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఒమిక్రాన్ ను తేలికపాటి వ్యాధి అని చెప్పడంలో అర్థం లేదని.. ఇది కూడా ప్రాణాంతకమైన వేరియంట్ అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
ఒమిక్రాన్ బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారని.. మరణాలు కూడా సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు.
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ దీన్ని తేలికపాటి వ్యాధిగా నిర్ధారించడం సరైంది కాదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఇప్పటికీ చాలా దేశాల్లో డెల్టా కంటే ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని.. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఫలితంగా కొన్ని దేశాల్లో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయన్నారు.
గత వేరియంట్లలాగే ఒమిక్రాన్ బాధితులు కూడా ఆస్పత్రుల్లో చేరుతున్నారన్నారు. ఇది కూడా మనుషులను చంపేస్తోందని తెలిపారు. కేసులు సునామీలా విరుచుకుపడుతున్నాయన్నారు. యావత్ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.