Begin typing your search above and press return to search.
అమెరికాను కుదిపేస్తున్న హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం కథేంటి?
By: Tupaki Desk | 3 Jan 2022 6:53 AM GMTవిలాసవంతమైన జీవితం కోసం అక్రమాలు.. ఆపై అమాయకులలైన అమ్మాయిలపై అఘాయిత్యాలు.. ఈ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు.. అలా కొన్నాళ్ల పాటు సాగిన అతని జీవితం చివరకు జైళ్లో అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ముగిసింది. బిలియన్ డాలర్ల కంటే తక్కువ సంపద ఉన్న వారి వద్ద పనిచేయడానికి ఇష్టపడని అతడు డబ్బే ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నాడు. అయితే తన పరపతి పెంచుకోవడం కోసం అమ్మాయిలను ఎరగా వేసేవాడు. ఇక తాను కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడడమే కాకుండా వారికి డబ్బు ఇచ్చి.. మరికొంత మంది అమ్మాయిలను తెస్తే డబ్బు ఇస్తానని ఆశ చూపాడు. అయితే అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, ట్రంప్ లతో స్నేహం చేసి.. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు.. తాజాగా అతని స్నేహితురాలిని విచారించిన నేపథ్యంలో మరికొన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఎంతకీ ఎవరతను..? అతని స్నేహితురాలు ఎవరు..?
జెప్రీ ఎఫిస్టన్.. ఈ పేరు ఇప్పుడు అమెరికాలో మారుమోగుతోంది. ఫైనాన్షియర్ గా పేరున్న ఈయన విలాస వంతమైన జీవితం వెనుక చీకటి కుంభకోణం దాగుంది. న్యూయార్క్ లో జన్మించిన జెప్రీ 1970లో ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ తన కెరీర్ ను మొదలు పెట్టాడు. అయితే ఈ సమయంలో ఓ విద్యార్థి తండ్రి జెప్రీని చూసి ప్రభావితమయ్యాడు. దీంతో ఆయన తన వాల్ స్ట్రీట్లోని తన భాగస్వామిని అయిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ కు పరిచయం చేశాడు. ఆ తరువాత ఎఫిస్టన్ సొంతంగా సంస్థను ప్రారంభించారు. అయితే అనుకోకుండా అతడు ధనవంతుడు కావడంతో డబ్బుపై మరింత ఆసక్తిని పెంచుకున్నాడు. సెలబ్రెటీలు, ప్రముఖులతో పరిచయం పెంచుకుని వారికి పార్టీలు ఇచ్చేవాడు.
దీంతో ఎపిస్టన్ కు క్లింటన్, ట్రంప్, కెనడీ లతో పాటు ప్రమఖ మీడియాకు చెందిన మిషెల్ బ్లూమ్ బెర్గ్, రిచర్డ్ బ్రాన్సన్, మైకెల్ జాక్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లాంటి వారు స్నేహితులుగా మారారు. అయితే జెఫ్రీ మీడియాకు ఎక్కువగా దూరంగా ఉండేవారు. కానీ 2002లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, నటులు కెవిన్ స్పాసీ, క్రిస్ టక్కర్ తో కలిసి ఎపిస్టన్ ఓ ప్రైవేట్ జెట్ లో అఫ్రికా ఖండంలో పర్యటించేందకు వెళ్లారు. ఈ పర్యటన గురించి ‘న్యూయార్క్ మ్యాగజైన్’ నిగూడైన కుభేరుడు.. జెఫ్ ఎపిస్టన్ అనే కథనం రాసింది. దీంతో అప్పట్లో ప్రముఖ వ్యాపారిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ కథనంలో ఎపిస్టన్ గురించి మాట్లాడారు. తనకు జెఫ్రీ బాగా తెలుసని, అతను నాలాగే అందమైన యువతులను ఇష్టపడుతారని తెలిపడం ఆశ్చర్యమేసింది.
ఆ తరువాత జెఫ్రీ తరుచూ మీడియాలో వచ్చారు. అయితే ట్రంప్, జెప్రీల మధ్య ఆర్థిక వివాదం తలెత్తింది. మరోవైపు ఎఫిస్టన్ మిస్ స్వీడన్ ఎవా అండర్సన్, గిలిన్ మాక్స్ వెల్ తో డేటింగ్లో పాల్గొన్నారు. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. అయితే అమాయకులైన అమ్మాయిలను వలలో వేసుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. డబ్బు ఎరగా వేసి వారిని పామ్ బీచ్ బంగ్లాకు తీసుకెళ్లి వారిపై లైంగిక దాడులు చేసేవాడు. 2005లోఫ్లోరిడాలోని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన తతంతంగమంతా బయటకొచ్చింది. దీంతో ఆయన 13 నెలలు జైలుకు వెళ్లాడు.
2019లో మీటూ ఉద్యమంలో ఎపిస్టన్ పై మరోసారి ఆరోపణలు వచ్చాయి. దేశం వదిలి పారిపోతున్న సమయంలో పోలీసులు అయనను మరోసారి అరెస్టు చేశారు. అయితే ఈసారి అతడి ఇంట్లో చైల్డ్ ఫొర్రోగ్రఫీ, నకిలీ పాస్ పోర్ట్స్ దొరికాయి. అయితే ఈ సంవత్సరంలోనే ఆగస్టు 10న జైళ్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడి బాధితుల సంఖ్య 50 వరకు ఉంటుందని ఉంటుందని పామ్ బీచ్ పోలీస్ చీప్ మిసెల్ రెయిటర్ ‘ ది మియామీ హెరాల్డ్ ’ అనేపత్రికకు వెల్లడించారు.
కాగా జెఫ్రీకి సహకరించిన అతని సన్నిహితురాలు మ్యాక్స్ వెల్ పై తాజాగా ఐదు నేరారోపణలు నిరూపితమయ్యాయి. ఎపిస్టన్ వద్దకు బాలికలను పంపించేందుకు సహకరించిందని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె 30 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలిపారు.