Begin typing your search above and press return to search.
తాలిబన్లకు తిరుగుబాటు రుచి చూపించారు.. తర్వాతేమైందంటే.
By: Tupaki Desk | 24 Aug 2021 4:42 AM GMTఅఫ్గాన్ రాజధాని కాబూల్ ను అక్రమించుకోవటం ద్వారా దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి (వేళ్ల మీద లెక్కించే కొన్ని ప్రాంతాలు మినహాయించింది) తెచ్చుకున్న వైనం తెలిసిందే. ఇది జరిగిన వారానికి అనూహ్యంగా అధికారాన్ని సొంతం చేసుకున్న తాలిబన్లకు తిరుగుబాటు షాక్ తగిలింది. ఇందుకు బగ్లాన్ ప్రావిన్సు వేదికైంది. ఇక్కడి తాలిబన్లపై స్థానిక సాయుధ ప్రజలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మూడు జిల్లాల్ని స్వాధీనం చేసుకుంది. దీంతో ఉలిక్కిపడిన తీవ్రవాదులు రోజు గడిచే సరికి చేజారిన మూడు జిల్లాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు హతమయ్యారు. కాబూల్ కు ఉత్తరాన దాదాపు 120 కి.మీ. దూరంలో ఉన్న బగ్లాన్ ప్రావిన్సులో స్థానిక ప్రజలు తాలిబన్లకు ఎదురుతిరిగారు. దీంతో.. తాలిబన్ల చేతిలో ఉన్న అంద్రాబ్ లోయలోని బానో.. దేహ్ సలాహ్.. పుల్ ఎ -హెసార్ జిల్లాలు స్వాధీనం అయ్యాయి. దీంతో షాక్ తిన్న తాలిబన్లు వెంటనే తేరుకొని.. అంద్రాబ్ కు అదనంగా తమ మూకను పంపారు. దీంతో.. వారు తిరుగుబాటును అణిచేసి.. మళ్లీ ఆ జిల్లాల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు తాలిబన్ల అధీనంలోని రాని పంజ్ షేర్ ను అక్రమించుకోవటానికి తాలిబన్లు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. వందలాది మంది ఫైటర్లు ఆ ప్రావిన్సును సొంతం చేసుకోవటానికి రంగంలోకి దిగారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మరోవైపు తాలిబన్ సైన్యంలోని 300 మందిని హతమార్చినట్లుగా పంజ్ షేర్ సైన్యం స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి.