Begin typing your search above and press return to search.

కోవిషీల్డ్‌ వేసుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్ చెప్పిన లాన్సెట్

By:  Tupaki Desk   |   22 Dec 2021 3:18 AM GMT
కోవిషీల్డ్‌ వేసుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్ చెప్పిన లాన్సెట్
X
లాన్సెట్ జర్నల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా పుణ్యమా అని అందరికి సుపరిచితమైన పదాల్లో లాన్సెట్ ఒకటి. ఈ మెడికల్ జర్నల్ లో.. వైద్య రంగానికి సంబంధించిన పరిశోధనల గురించిన విశేషాలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటుంది. అప్ డేటెడ్ గా ఉంటే ఈ జర్నల్ తాజాగా షాకింగ్ అంశాన్ని వెల్లడించింది. కరోనాకు రక్షణ కవచంగా పేర్కొనే ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా రూపొందించిన కరోనా టీకా రక్షణ.. అంచనా కంటే తక్కువగా ఉందన్న విషయాన్ని వెల్లడించింది.

భారత్ లో దీన్ని కోవిషీల్డ్ పేరుతో విడుదల చేయటం తెలిసిందే. బ్రెజిల్.. స్కాట్ లాండ్ లో సేకరించిన గణాంకాల ఆధారంగా చూసినప్పుడు.. ఈ టీకాను రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడు నెలలకు అది కల్పించే రక్షణ తగ్గుతుందన్న విషయాన్ని గుర్తించినట్లుగా పేర్కొంది. దీనికి సంబంధించిన అధ్యయన వివరాల్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ టీకాను తీసుకున్న వారికి బూస్టర్ డోసులు ఇవ్వటం ద్వారా రక్షణ పెంచాలన్న సూచన చేసింది.

మన దేశంలో ఎక్కువమందికి పంపిణీ చేసిన టీకాల్లో కోవిషీల్డ్ ముందుంది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటక్ వారి కొవాగ్జిన్ టీకా కంటే కూడా కొవిషీల్డ్ టీకానే ఎక్కువమంది వేయించుకోవటం తెలిసిందే. కోవిషీల్డ్ తో రక్షణ కవచం ఉంటుందని నమ్మిన వారికి.. లాన్సెట్ తాజాగా చెప్పిన మాట విన్న వారు షాకయ్యే పరిస్థితి. మరి..మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.