Begin typing your search above and press return to search.

9 గంటలు మించి కూర్చొనే వారికి షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   24 Aug 2019 1:30 AM GMT
9 గంటలు మించి కూర్చొనే వారికి షాకింగ్ న్యూస్
X
పూర్వం అంటే కట్టలు కొట్టడమో..కూలో.. నాలో కష్టించి పనిచేయడమో చేసి కుటుంబాన్ని పోషించుకునే వారు. ఇప్పుడంతా డిజిటల్.. కంప్యూటర్ వచ్చాక అన్ని పనులు దాంతోనే.. ఆఫీసుల్లో కంప్యూటర్ తెరల ముందు కూర్చొని పనిచేయడాలు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు- ఇతర ప్రైవేటు ఉద్యోగులు కూడా అదే పనిగా సీట్లలో గంటల తరబడి కూర్చొని పనిచేయక తప్పని పరిస్థితి.

మారుతున్న సామాజిక పోకడ.. ఆధునిక ఉద్యోగాలన్నీ కూర్చొని పనిచేసేవే.. దీంతో శారీరక శ్రమ అన్నదే మనిషికి లేకుండా పోతోంది. ఇప్పుడమే మనల్ని మరణశయ్యకు దగ్గర చేస్తోంది.

9 గంటలు మించి కూర్చొని పనిచేస్తే మీరు తొందరగా పైకి పోతారని తాజాగా నార్వే దేశానికి చెందిన ‘నార్వేజియన్ స్పోర్ట్స్ స్కూల్ పరిశోధకులు’ పరిశోధించి మరీ చెప్పిన చేదు నిజమిదీ.. 18-64 ఏళ్ల మధ్య వారు దాదాపు 36383 మందిపై వీరు అధ్యయనం చేశారు. అందరికంటే 9 గంటల పాటు కూర్చొని పనిచేసిన 2149మంది తమ సగటు జీవితకాలం కంటే తొందరగానే మరణించినట్టు వీరి అధ్యయనంలో తేలింది. వీరు శారీరక శ్రమ చేయకపోవడం.. చాలా తక్కువ వ్యాయమం చేసిన వారు.

అందుకే ప్రతీ మనిషి వారానికి కనీసం 75 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని.. లేదంటే మీ ప్రాణాలు ముందుగానే పోతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.