Begin typing your search above and press return to search.

పుతిన్ తలకు వెల కట్టిన బిలియనీర్.. రష్యా సైన్యానికి షాకింగ్ ఆఫర్

By:  Tupaki Desk   |   4 March 2022 4:30 AM GMT
పుతిన్ తలకు వెల కట్టిన బిలియనీర్.. రష్యా సైన్యానికి షాకింగ్ ఆఫర్
X
రష్యా - ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న వార్ మీద ఎవరి అభిప్రాయాలు వారివి అన్న విషయం తెలిసిందే. అయితే.. అకారణంగా ఉక్రెయిన్ ను టార్గెట్ చేయటాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు పుతిన్ కున్న ఇమేజ్.. అతడి పాలనలో రష్యా రాజకీయంలో మారిన ముఖచిత్రంతో పాటు.. తనను తాను రష్యా జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకోవటం లాంటివి చాలామందికి నచ్చని పరిస్థితులు. చాలామంది రష్యన్లు పుతిన్ కు వ్యతిరేకంగా గళం విప్పితుంటారు. తన రాజకీయ ప్రస్థానంలో తనకు ఎదురొడ్డి నిలబడిన వారిని అత్యంత దారుణంగా ఇబ్బంది పెట్టే పుతిన్ ప్రాణానికి వెల కట్టేశాడో వ్యాపారవేత్త.

రష్యాకు చెందిన వ్యాపారవేత్త కొనానిఖిన్‌.. దాదాపు రెండు దశాబ్దాల కిందటే దేశాన్ని వదిలేసి.. అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడే స్టార్టప్ వ్యాపారాలు చేస్తూ.. వందలాది కోట్లు సంపాదిస్తున్నాడు. ఇదిలాఉంటే.. తన సొంత దేశమైన రష్యాకు సంబంధించి ఆయన అప్పుడప్పుడు స్పందిస్తుంటారు. తన దేశాన్ని పుతిన్ నాశనం చేస్తున్నాడని మండిపడుతుంటారు. తాజాగా జరుగుతున్న యుద్దంపై తీవ్ర ఆగ్రహాన్నిప్రదర్శిస్తున్న ఈ వ్యాపారవేత్త.. తమ దేశాధ్యక్షుడు పుతిన్ ను చంపేసిన వారికి ఏకా ఏకిన రూ.7.5 కోట్ల భారీ మొత్తాన్ని బహుమానంగా ఇస్తానని ప్రకటించారు.

సోషల్ మీడియా లోని ఫేస్ బుక్ లో పోస్టు చేసిన కొనానిఖిన్.. పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా అరెస్టు చేసినా.. లేదంటే చంపేసినా.. సదరు వ్యక్తికి రూ.7.5 కోట్లు (మిలియన్ డాలర్లు) నజరానాగా ఇస్తానని ప్రకటించి సంచలనంగా మారారు. తానీ ఆఫర్ ను రష్యా సైన్యానికి ఓపెన్ గా ఇచ్చేశారు. ప్రస్తుతం అతని నికర సంపద విలువ దాదాపు 300 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు.

పుతిన్ కు వ్యతిరేకంగా గళం విప్పిన ఆయన.. తన దేశంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు తనను స్పందించేలా చేస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేతులు కట్టుకొని ఉండలేనని చెప్పిన ఆయన.. పుతిన్ ను లేపేసే అవకాశాన్ని దేశ ఆర్మీకి అప్పజెబుతున్నట్లుగా చెప్పారు. తన డీల్ ను ఓకే చేసినోళ్లకు భారీ నజరానా ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగిన పుతిన్.. వేలాది మంది మరణానికి కారణమన్నారు.

పుతిన్ ను యుద్ధఖైదీగా అరెస్టు చేసినా.. చంపిన సైనికులకు.. అధికారులకు వన్ మిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అమెరికాలో ఉంటున్న ఆయన.. ఉక్రెయిన్ పౌరులకు తన సంఘీభావం తెలపటం గమనార్హం. మరీ.. ఈ బిలియనీర్ మాటల ప్రభావం రష్యన్ల మీద ఏవిధంగా ఉంటుందో కాలమే సరైన సమాధానం చెప్పగలదేమో?