Begin typing your search above and press return to search.

పబ్లిక్ సర్వీస్ పరీక్ష.. ఇలాంటి ప్రశ్న అడుగుతారా?

By:  Tupaki Desk   |   16 July 2019 11:20 AM GMT
పబ్లిక్ సర్వీస్ పరీక్ష.. ఇలాంటి ప్రశ్న అడుగుతారా?
X
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభాసుపాలు అవుతోంది. పేపర్ సెట్ చేసే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా వందలాది మంది విద్యార్థుల భవిత అంధకారంగా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పరీక్ష నిర్వహించారు. అయితే ఇందులో అడిగిన ప్రశ్నపై అభ్యర్థులు, పలువురు నిపుణులు అసంత‌ృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల్లో ‘గవర్నర్ నిజంగానే కీలుబొమ్మనా.? గవర్నర్ బాధ్యతలు, వ్యవస్థ’పై అడిగిన ప్రశ్న పలువురిని షాక్ కు గురిచేస్తోంది. జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఈ ప్రశ్న వేశారు. 38మార్కులు కేటాయించారు.

బీహార్ లో గవర్నర్ వ్యవస్థ ఎప్పుడూ వివాదంలోనే ఉంది. 2000లో అత్యధిక సీట్లు సాధించిన ఆర్జేడీని కాదని నితీష్ కుమార్ ను సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేయమనడం వివాదాస్పదమైంది. నితీష్ సీఎం అయిన 7వరోజే బలపరీక్ష నిరూపించుకోక ఓడిపోయారు. ఇక 2005లో కూడా అప్పటి గవర్నర్ బూటా సింగ్ అసెంబ్లీని రద్దు చేయడం వివాదాస్పదమైంది. సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది.

ఇలా బీహార్ లో గవర్నర్ ల వివాదాలు, వారి ప్రవర్తనపై విమర్శలున్న వేళ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రశ్న వేయడం దుమారం రేపింది. దీనిపై బీహార్ కమిషన్ ఎగ్జామినర్ కూడా స్పందించాడు. ఈ ప్రశ్న ఇలా అడిగేది కాదన్నారు. ప్రశ్న సెట్ చేసిన అధ్యాపకుడిని సస్పెండ్ చేశామన్నారు. అయితే పరీక్షను మళ్లీ నిర్వహించమని పేర్కొన్నారు.