Begin typing your search above and press return to search.

బాబు స‌న్ రైజ్ మాట‌ల‌కు షాకింగ్ రియాక్ష‌న్స్‌

By:  Tupaki Desk   |   30 Jan 2018 4:06 AM GMT
బాబు స‌న్ రైజ్ మాట‌ల‌కు షాకింగ్ రియాక్ష‌న్స్‌
X
తెలిస్తే తెలిసిన‌ట్లు మాట్లాడాలి. తెలియ‌కుండా నోరు మూసుకోవాలి. ఇవాల్టి గూగుల్ రోజుల్లో నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే తాట తీసేందుకు నెటిజ‌న్లు సిద్ధంగా ఉన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లాంటి సీనియ‌ర్ మోస్ట్ సీఎం.. హైద‌రాబాద్ ను ఎక్క‌డికో తీసుకెళ్లిన పెద్ద‌మ‌నిషికి వ‌య‌సు మీద ప‌డ‌టం కార‌ణ‌మో.. లేక విశ్రాంతి లేనట్లుగా మారిన బిజీ షెడ్యూల్ తోనో మతిమ‌రుపు రావ‌టం కానీ.. తానేం మాట్లాడుతున్నానో త‌న‌కు తెలీకుండా మాట్లాడ‌టం కానీ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌ను ఎదుర్కొంటున్నారు.

తూర్పు తీర ప్రాంతంగా ఏపీ నుంచే సూర్యుడు ఉద‌యిస్తున్నందున.. ఏపీని స‌న్ రైజ్ స్టేట్ అంటూ స‌రికొత్త నినాదాన్ని ఇవ్వ‌ట‌మే కాదు.. జీకే మీద ఉన్న మినిమం నాలెడ్జ్ ఉన్న వారికి షాక్ త‌గిలేలా చేశారు. బాబు లాంటి పెద్ద‌మ‌నిషి నోట్లో నుంచి వ‌చ్చిన స‌న్ రైజ్ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు సీరియ‌స్ అయ్యారు. తెలిసి మాట్లాడాలి కానీ ఇలా మాట్లాడేస్తారా? అంటూ ఓ రేంజ్లో ఏసుకున్నారు నెటిజ‌న్లు.

దేశంలో తొలి సూర్యోద‌యం ఏపీ అని బాబు చెబుతున్న‌ప్ప‌టికీ.. మ్యాప్ తీసుకొని చూస్తే విష‌యం అర్థ‌మవుతుంది క‌దా? అంటూ నెటిజ‌న్లు స‌ల‌హా ఇస్తున్నారు. ఏపీ భార‌త‌దేశంలో తూర్పు తీరంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీ కంటే మ‌రికొన్ని రాష్ట్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఎలా మ‌ర్చిపోతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

భార‌త్‌కు అత్యంత తూర్పు తీరంలో ఉన్న ప్రాంతం అరుణ‌చ‌ల్ ప్ర‌దేశ్ గా చెప్పాలి. ఆ ప్రాంతంలోని పూర్వాంచ‌ల్ ప‌ర్వ‌తాల్లోని దిల్సా క‌నుమ వ‌ద్ద డింగా అనే చిన్న గ్రామం ఉంది. అక్క‌డ దేశంలో సూర్యుడు మొద‌ట క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాతే మిగిలిన ప్రాంతాల్లో సూర్యోద‌యం అవుతుంది.

మ‌రింత టెక్నిక‌ల్ గా చెప్పాలంటే.. భారత దేశం 68°7' 97°25' రేఖాంశాల మధ్య ఉంటుంది. 97°25' రేఖాంశంపై అరుణాచల్ ప్రదేశ్ లోని డాంగ్ ఉంది. దేశంలో అక్కడే తొలి సూర్యోదయం జ‌రిగేది. ఇక‌.. బాబు పాలిస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ 76°46' నుంచి 84°46' రేఖాంశాల మధ్య ఉంటుంది. శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురం మండ‌లం బాహుదా న‌ది బంగాళాఖాతంలో క‌లుస్తున్న చోట ఏపీలో తొలి సూర్యోద‌యం జ‌రిగేది.

ఇంకోలా చెప్పాలంటే.. ఏపీ కంటే ముందుగా 12 రాష్ట్రాల్లో సూర్యోద‌యం జ‌రిగిన త‌ర్వాతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ సూర్య‌ద‌ర్శ‌నం జ‌రుగుతుంది. ఇలాంటి వేళ‌.. బాబు నోటి నుంచి వ‌చ్చిన బ‌డాయి మాట‌లపై ఎట‌కారంగా మారాయి. సోష‌ల్ మీడియాలో బాబు వ్యాఖ్య‌ల‌పై వ్యంగ‌స్త్రాల్ని సంధించుకున్నారు. జ‌రిగిందేదో జ‌రిగింది. ఇక‌నైనా ఇలాంటి టెక్నిక‌ల్ ఇష్యూలు మాట్లాడే ట‌ప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిది. లేని ప‌క్షంలో ప‌రువు పోవ‌టం ఖాయమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.