Begin typing your search above and press return to search.
మెడలో వైసీపీ కండువా వేసుకొని కొడాలి నాని పై షాకింగ్ వ్యాఖ్యలు
By: Tupaki Desk | 24 Jan 2022 4:20 AM GMTరాజకీయ ప్రత్యర్థులపై ఏ మాత్రం కనికరం లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. తాను చేసిన వ్యాఖ్యల అర్థం ఏమిటన్న విషయంపై అవగాహన ఉందా? లేదా? అన్న భావన కలిగేలా ఉంటున్నాయి ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు.వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న కొడాలి నాని.. సందర్భం ఏదైనా సరే విపక్ష నేత చంద్రబాబుపైన ఎంత ఘాటైన వ్యాఖ్యలు చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదిలా ఉంటే.. ఆ మధ్య వైసీపీ మంత్రి బాలినేనిపై వ్యాఖ్యలు చేయటం ద్వారా.. ఆయన అనుచరులు కోపంతో దాడి చేసిన ఉదంతంతో వెలుగులోకి వచ్చారు వైసీపీ నేత సుబ్బారావు గుప్తా.
ఒకరూంలో ఆయనపై సొంత పార్టీ నేతలే తీవ్రంగా దాడి చేసిన వైనం వైరల్ గా మారి.. వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ఒంగోలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు సుబ్బారావు గుప్తా. మెడలో వైసీపీ కండువాను వేసుకొని మరీ మాట్లాడిన ఆయన.. కొడాలి నాని ఇష్యూలో పార్టీకి అల్టిమేటం జారీ చేయటం గమనార్హం. మంత్రి కొడాలి నాని చేసే వ్యాఖ్యల కారణంగా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిపై సీఎంజగన్మోహన్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
72 గంటల్లో మంత్రి నానిపై చర్యలు తీసుకోకపోతే.. తామే వైసీపీని బహిష్కరించాల్సి వస్తోందన్న హెచ్చరికను జారీ చేసి సంచలనంగా మారారు. సీఎం జగన్ కు అల్టిమేటం జారీ చేసిన సుబ్బారావు గుప్తా..కొడాలి నాని వ్యాఖ్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే..
- కొడాలి మాట తీరు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా ఆయన శైలి ఉంది. పార్టీకి ఓటేయాలంటేనే బాధపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు.
- నేనూ వైసీపీ కార్యకర్తనే. కొడాలి నాని తీరుతో కలత చెంది మాట్లాడుతున్నా. కొడాలి నాని ప్రెస్ ముందుకొస్తే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇంట్లో ఆడోళ్ల గురించే కాకుండా.. కాపు, కమ్మ అంటూ కులాలు, మతాలు గురించి అన్నీ చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు.
- కొడాలి నాని.. నీ భాష వల్ల, నీ భావాల వల్ల, నీ దమ్ము వల్ల వైసీపీకి ఓట్లు రోజూ పోతున్నాయి. జగనన్న 4 శాతం ఓట్లు తీసుకొస్తే.. నీ మాటల వల్ల 40 శాతం ఓట్లు పోయేలా ఉన్నాయి.
- అర్జెంట్ గా కొడాలి నానిని బహిష్కరించడమా.. లేకపోతే మేమే పార్టీని బహిష్కరించి బయటకు వెళ్లిపోవడమే జరగాలి. కొడాలి నాని మాటల వల్ల వైసీపీలో తిరుగుబాటు వచ్చేలా ఉంది. ఇది నేను వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. పార్టీ కార్యకర్తలందరి తరఫున మాట్లాడుతున్నా.
- నీ వల్ల రెడ్లు, కమ్మ అందరూ బాధపడుతున్నారు. కులాల పేరుతో తెగ తిడుతున్నారు. నువ్వు సింహాల దాడి చూశావ్.. తోడేళ్ల దాడి చూస్తావ్ నాని!
- తోడేళ్ల దాడి ఎలా ఉంటుందో తెలుసా? పీక్కు తిని పోతుంటాయి. వైసీపీ కార్యకర్తలు నీపై దాడి చేస్తే అలా ఉంటుంది. నీ వల్ల వైసీపీ ఓట్లన్నీ పోతున్నాయి.. ఏం చేయాలి? జగనన్న నువ్వన్నా కళ్లు తెరువన్నా.
- నువ్వు కళ్లు తెరవకపోతే, మేమంతా కళ్లు మూసుకుని వేరే రాష్ట్రాలకు పారిపోవాల్సి వచ్చేలా ఉంది. పార్టీలో ఉండి మేమేం చేయాలి? కొడాలి నానిని కంట్రోల్ చెయ్ అన్నా.
- ఒకవేళ కంట్రోల్ చేయలేకపోతే.. ఒక పని చెయ్. రాష్ట్రంలో లా అండ్ సరిగ్గా లేదు కదా. ఆయనకు హోం మంత్రి పదవి ఇవ్వు. బాగా చేస్తాడు! లేకపోతే బూతుల శాఖ ఇవ్వు.. తెలుగుదేశం వాళ్లు అలా చేస్తేనే కదా.. వాళ్లను ప్రతిపక్షంలో కూర్చోపెట్టింది. మళ్లీ మనం ఎందుకు ఇలా తిట్టడం?
- ఇంట్లో వాళ్లను, కులాలను, మతాలను తిట్టేది ఏంటి? ఎందుకన్నా మా పార్టీని నాశనం చేస్తున్నావ్? చేతులెత్తి వేడుకుంటున్నా. జగనన్నా మీకు 72 గంటలు టైమిస్తున్నా. అప్పట్లోపు నువ్వు కళ్లు తెరువు. నువ్వు కళ్లు తెరవకపోతే, మేమే కళ్లు మూసేలా ఉన్నాం. గుడివాడలో 2024లో నేను పోటీ చేస్తా.