Begin typing your search above and press return to search.
'కాకినాడ'పై షాకింగ్ రిపోర్ట్.. టీడీపీలో తర్జన భర్జన..!
By: Tupaki Desk | 27 Nov 2022 11:30 PM GMTరాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో జోష్ నింపాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయా జిల్లాల్లో పరిస్థితిపై అధ్యయనం చేయిస్తున్నారు. అక్కడి తమ్ముళ్లు ఎలా ఉన్నారు? ఏంచేస్తున్నారనేది ఆయన తెలుసుకుని, తర్వాత వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఈ క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాకినాడకు చెందిన నాయకులకు సంబంధించి అందిన రిపోర్టు బాబును కలవరపెడుతోందని అంటున్నారు పరిశీలకులు. జిల్లాలోని పలు నియోజకవర్గ ఇన్‌చార్జిలే పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉండడం గమనార్హం.
కొన్నిచోట్ల కీలకమైన ఇన్‌చార్జిలను మార్చేస్తే మరికొన్నిచోట్ల అసలు లేకపోవడం.. దీనిని పార్టీ పట్టించుకోక పోవడం చర్చకు వస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగా లేదని తాజాగా అందిన నివేదిక స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కీలకమైన కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌లో మూడు గ్రూపులు, ఆరు వర్గాలు అన్నట్టు పార్టీ తయారైందని అంటున్నారు.
కాకినాడ నగరంలో పార్టీ వర్గాలుగా విడిపోవడానికి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సొంత నిర్ణయాలు.. నియంతృత్వ పోకడలే కారణమని సుంకర పావని వర్గం ఆరోపిస్తోంది. కొండబాబు, మాజీ మేయర్ సుంకర పావని వర్గాల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. కొండబాబుకు ఉద్వాసన పలికి, ఇన్‌చార్జిగా పావనిని నియమించారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇది పార్టీని బజారున పడేసినట్టు అవుతోంది.
కాకినాడ రూరల్ టీడీపీలోనూ రెండు వర్గాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబా బు దంపతుల నిర్వాకంతో పార్టీ ఖాళీ అయిపోయిందని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. ఇదంతా పెద్దా పురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వర్గం చేస్తున్న దుష్ప్రచారమని సత్తిబాబు వర్గం అంటోంది.
చినరాజప్ప ప్రోద్బలంతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయని తెలుస్తోంది. అయితే కీలక నాయకులే వివాదాలకు కేరాఫ్‌గా ఉండడంతో చంద్రబాబుకు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు.