Begin typing your search above and press return to search.
డౌట్ వద్దు.. ఈసారీ కుప్పం బరిలోనే.. తేల్చేసిన చంద్రబాబు
By: Tupaki Desk | 7 Jan 2022 6:30 AM GMTతెలుగుదేశం పార్టీకి.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కంచుకోట లాంటి కుప్పంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి తెలిసిందే. ఈ మధ్యనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి దారుణ పరాభవం ఎదురైన వేళ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు బరిలో నుంచి దిగాల్సిన ప్లేస్ మారనుందా? అన్న చర్చ మొదలైంది. గతంలో మాదిరి కాకుండా ఈసారి కుప్పం కాకుండా వేరే నియోజకవర్గం అయితే మంచిదన్న సూచనలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా అమరావతి పరిధిలో కానీ.. క్రిష్ణా జిల్లాలోని సేఫ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న అంచనాలు మొదలయ్యాయి.
ఇలాంటి స్పెక్యులేషన్లకు చెక్ చెప్పేశారు చంద్రబాబు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్న విషయంపై స్పష్టత ఇచ్చేశారు. తాను ఈసారీ కుప్పం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. పంచాయితీ.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కుప్పంలో గెలిచిందా? అని వైసీపీ నేతలు అడుగుతున్నారని.. నియోజకవర్గంలో తనపైనా.. తెలుగుదేశం పార్టీ పైనా అభిమానం చెక్కు చెదర్లేదన్నారు.
అయితే.. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయటంతోపాటు.. స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ నేతల్ని అధికార పార్టీ లోబర్చుకుందన్నారు. ఇంత చేసి గెలిచామని విర్రవీగుతున్నారని చెప్పారు. తాను మరోసారి కుప్పం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని.. సక్రమంగా లేని స్థానిక నాయకత్వాన్ని మారుస్తానని.. కార్యకర్తల్ని నాయకులుగా తయారు చేస్తానని స్పష్టం చేశారు.
చంద్రబాబు మాటల్ని చూస్తే.. కుప్పం నుంచి కాకుండా మరే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసినా.. అధికార పార్టీ అప్లై చేసిన మైండ్ గేమ్ కు చిక్కినట్లే అవుతుందని.. తాను నియోజకవర్గం మారితే నైతికంగా ఓడినట్లే అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తటం ఖాయమని.. అందుకే.. కుప్పంతోనే ఈసారీ కొనసాగాలని చంద్రబాబు డిసైడ్ చేశారని చెప్పక తప్పదు.