Begin typing your search above and press return to search.
పవన్ కు షాకింగ్ సపోర్ట్ : మెగా ఫ్యామిలీ అంతా జనసేన వెంటే...?
By: Tupaki Desk | 14 Jun 2022 12:30 PM GMTవచ్చే ఎన్నికలను జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆషామాషీగా అసలు తీసుకోవడంలేదు. ఆయన ఈసారి కచ్చితంగా అధికారంలోకి ఎలాగైనా రావాలని చూస్తున్నారు. దీని కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. గతంలో పవన్ చేసిన తప్పులను ఈసారి చేయదలచుకోవడంలేదు. 2014 ఎన్నికల వేళ జనసేన పార్టీని ప్రకటించి బీజేపీ, టీడీపీలకు మద్దతు ప్రకటించిన సమయంలో పవన్ ఒక్కడుగానే ఉన్నారు. ఇక 2019 ఎన్నికల నాటికి ఆయనకు మెగా బ్రదర్ నాగబాబు తోడు అయ్యారు.
ఆయనకు నర్సాపురం పార్లమెంట్ సీటుని ఇచ్చి పోటీ చేయించారు. నాగబాబు కూడా భారీ ఎత్తున ఓట్లను సంపాదించుకున్నారు. ఈక్ 2024 ఎన్నికల వైపుగా పవన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మరోమారు నాగబాబు యాక్టివ్ అయ్యారు. ఆయన ఇప్పటికే జనసేన తరఫున జిల్లాల టూర్లు చేస్తూ మద్దతు కూడగడుతున్నారు.
అదే సమయంలో ఈసారి పవన్ వెంట టోటల్ మెగా ఫ్యామిలీ కూడా నిలిచి ఫుల్ సపొర్ట్ చేస్తుందని ప్రచారం అయితే ఉంది. దానికి నాంది అన్నట్లుగా తాజాగా మెగా ఫ్యామిలీలోని వారంతా ముందుకు వచ్చి పవన్ ప్రారంభించిన కౌలు రైతుల భరోసా కార్యక్రమానికి ఏర్పాటు చేసిన నిధికి తమ వంతుగా విరాళాలు ఇచ్చారు. అలా నాగబాబు కుటుంబం నుంచి ఆయనతో పాటు సతీమణి పద్మజ, కుమారుడు హీరో వరుణ్ తేజ్, కుమార్తె నీహారిక కలిపి పదిహేను లక్షల దాకా విరాళాన్ని ఇచ్చారు.
ఇక పవన్ సోదరీమణులు మాధవి, విజయదుర్గ, మేనల్లుళ్ళు సాయి ధర్మ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పెదనాన్న గారి అబ్బాయి, బావలు ఇలా చాలా మంది మరో ఇరవై లక్షలు దాకా ఇచ్చి ఈ విరాళంలో పాలుపంచుకున్నారు. వీరంతా జనసేన ఆఫీసుకు వచ్చి మరీ నాదెండ్ల మనోహర్ కి విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇంతవరకూ మా ఇంట్లో రాజకీయాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
అంతా తటస్థంగా ఉంటారు. వారి పనులు వారు చూసుకుంటారు, నేను రాజకీయాల్లో గెలవాలని మాత్రమే వారు కోరుకుంటారు. కానీ కౌలు రైతుల సమస్యల మీద ఫస్ట్ టైమ్ వారు చలించి ఇలా భారీ విరాళాలు ఇచ్చారు అని చెప్పారు. మొత్తానికి పవన్ కోసం మెగా ఫ్యామిలీ అంతా కదలివచ్చింది అనుకోవాలి. ఏపీలో కౌలు రైతుల సమస్య మీద జనసేన పోరాడుతూంటే దానికి ఫ్యామిలీ నుంచి మద్దతు దక్కడమే కాకుండా రాజకీయాల మీద వారు మొదటిసారి చూశారు.
మరి ఇది ఇక్కడితో ఆగుతుందా అన్నదే చర్చ. రానున్న రోజుల్లో జనసేనతో మెగా ఫ్యామిలీ కీలకంగా మారుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. 2024 ఎన్నికల్లో పవన్ గెలవాలని అంతా కోరుకుంటున్నారు. ఇపుడు విరాళాలలో తలా ఒక చేయి వేసినట్లుగా పవన్ రాజకీయ ప్రయాణంలో కూడా మద్దతు ఇస్తూ జనంలోకి వస్తారా అంటే జవాబు ఎందుకు కాకూడదు అని వస్తోంది. చాలా మందికి ఇంటినుంచి మద్దతు దక్కుతోంది. చంద్రబాబుకు మొత్తం నందమూరి ఫ్యామిలీ ఈసారి రంగంలోకి దిగి టీడీపీ గెలుపు కోసం పనిచేస్తుంది అంటున్నారు.
అలాగే పవన్ కోసం మెగా ఫ్యామిలీ కూడా దిగి ఏపీ నలుచెరగులా కలియతిరిగి విస్తృతమైన ప్రచారం చేస్తుంది అంటున్నారు. అదే విధంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ లో కొందరు పోటీ చేయడానికి ఉత్సాహపడుతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చూస్తే 2024లో మెగా ఫ్యామిలీ టోటల్ గా పవన్ వెంట నిలవడం ఖాయమని తెలుస్తోంది. 2024 లో గెలుపు కంటే ముందు పవన్ ఒక రకంగా ఇంట గెలిచారు అని అంటున్నారు. మరి మెగా ఫ్యామిలీ అంతా కదిలితే మాత్రం జనసేన గేర్ మార్చినట్లే, జోరు పెంచినట్లే.