Begin typing your search above and press return to search.

వ‌ర్క్ ఫ్రమ్ వ‌ద్దే వ‌ద్దంట.. ఈ మాట అనేది ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   3 Aug 2021 9:33 AM GMT
వ‌ర్క్ ఫ్రమ్ వ‌ద్దే వ‌ద్దంట.. ఈ మాట అనేది ఎవ‌రో తెలుసా?
X
క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఆఫీసుల‌న్నీ ఇళ్ల‌కు వెళ్లిపోయాయి. గ‌తంలో ఒక‌టీ రెండు బ్రాంచ్ లు ఉండేవి. కానీ.. ఇప్పుడు ఎంత మంది ఉద్యోగులు ఉంటే.. అన్ని బ్రాంచీలుగా మారిపోయింది ప‌రిస్థితి! అయితే.. ఇంటి నుంచి ప‌నిచేయ‌డం పై ఒక్కొక్క‌రి అభిప్రాయం ఒక్కోలా ఉంది. మ‌రి, మెజారిటీ జ‌నం ఎలా ఫీల‌వుతున్నారు అన్న‌ది పాయింట్‌. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం మొద‌లైన తొలి రోజుల్లోకి.. ఇప్ప‌టికీ చాలా మంది చాలా మార్పులు వ‌చ్చాయ‌ని అంటున్నారు. మ‌రి, ఇంత‌కీ.. ఉద్యోగులు ఏమంటున్నారు? వాళ్ల ఇంట్లో వాళ్లు ఏమంటున్నారు? కంపెనీలు ఏమంటున్నాయి? అనే విష‌యం తెలుసుకునేందుకు ఓ స‌ర్వే నిర్వ‌హించారు. మ‌రి, ఈ రిపోర్టు ప్ర‌కారం ఎవ‌రి ఫీలింగ్ ఏంటీ అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

క‌రోనా మొద‌టి ద‌శ‌లో కొన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రమ్ ఇచ్చాయి. సెకండ్ వేవ్ అన్నీ ఇదే ప‌ద్ధ‌తి ఫాలో అయ్యాయి. ఇప్ప‌టికీ చాలా కంపెనీలు ఇంటి నుంచే ప‌ని చేయించుకుంటున్నాయి. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ అంటున్నందువ‌ల్ల చాలా కంపెనీలు.. వేచి చూస్తున్నాయి. కానీ.. కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు పిలుస్తున్నాయి. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లను లైట్ తీసుకుంటూ ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేయాల‌ని ఉద్యోగుల‌కు సూచిస్తున్నాయి.

ప్ర‌ముఖ ఐటీ కంపెనీలు ఈ విష‌యంలో ముందంజ‌లో ఉన్నాయి. అతి త్వ‌ర‌లో ఆఫీసుల‌కు వ‌చ్చేయాల‌ని ఉద్యోగుల‌కు సూచిస్తున్నాయి. ఈ మ‌ధ్య‌నే.. ఇన్ఫోసిస్ ఉద్యోగుల‌కు ఒక లేఖ పంపింది. త్వ‌ర‌లో ఆఫీసుల‌కు రావాల్సి ఉంటుంద‌ని అందులో పేర్కొంది. ఇన్ఫోసిస్ మాత్ర‌మే కాకుండా.. ఇత‌ర కంపెనీలు కూడా ఇదే ఆలోచ‌న చేస్తున్నాయి. సెకండ్ వేవ్ ఇంకా కొన‌సాగుతుండ‌గానే.. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వినిపిస్తుండ‌గానే.. ఇలా పిల‌వ‌డానికి కార‌ణ‌మేంట‌న్న‌ప్పుడు.. వ్యాక్సిన్ మీద భ‌రోసా ఉంచుతున్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తానికి కంపెనీలు త‌మ ల‌క్ష్యం కోసం నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. మ‌రి, ఉద్యోగులు ఏమంటున్నారు? ఉద్యోగుల ఫ్యామిలీస్ ఏం కోరుకుంటున్నాయి? అనే విష‌యం తెలుసుకునేందుకు ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాక‌ర్ అనే సంస్థ తాజాగా ఓ స‌ర్వే నిర్వ‌హించింది.

మొత్తం దేశంలోని తొమ్మిది ప్ర‌ధాన న‌గ‌రాల్లో 1200 కంపెనీల‌ను, 1500 మంది ఉద్యోగుల‌ను స‌ర్వే చేసింది. దీని ప్ర‌కారం.. దాదాపు 35 శాతం కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ బెట‌ర్ అని అంటున్నాయ‌ట‌. 23 శాతం కంపెనీలు మాత్రం.. ఉద్యోగులు ఆఫీసుకు వ‌చ్చి ప‌నిచేస్తేనే బాగుంటుంద‌ని అంటున్నాయి. మ‌రో 42 శాతం కంపెనీలుమాత్రం.. ఇల్లు, ఆఫీసు నుంచి ప‌నిచేసే విధానం బాగుంటుంద‌ని, త‌ద్వారా.. ఎప్పుడు అవ‌స‌ర‌మైతే అప్పుడు మార్చుకోవ‌చ్చ‌ని అంటున్నాయ‌ట‌.

మ‌రి, ఉద్యోగుల మాట ఏంటీ అన్న‌ప్పుడు.. ఇక్క‌డ క్లాష్ ఏర్ప‌డుతోంది. మ‌హిళా ఉద్యోగులు ఇంటి నుంచే ప‌నిచేయాల‌ని మెజారిటీగా కోరుతుండ‌గా.. మ‌గాళ్లు మాత్రం ఆఫీసుకే ఓటేశారు! దాదాపు 51 శాతం మంది మ‌హిళ‌లు ఇంటి నుంచే ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నార‌ట. అదే పురుషుల విష‌యానికి వ‌స్తే మాత్రం కేవ‌లం.. 29 శాతం మంది మాత్ర‌మే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కోరుకుంటున్నారు. సాధార‌ణంగా బ‌య‌ట తిర‌గ‌డానికి అల‌వాటు ప‌డే మ‌గాళ్లు.. ఇంట్లో కూర్చొని ప‌ని చేయ‌డం ఇబ్బందిగా ఫీల‌వుతున్నార‌ట‌. ఇక మ‌రో 25 శాతం మంది ఉద్యోగులు మాత్రం.. తాము ఎక్క‌డైనా రెడీ అంటున్నార‌ట‌. త‌మ‌కు ప‌ని చేసే చోటు ముఖ్యం కాద‌ని, జీతం ఎంత ఇస్తార‌న్న‌దే ముఖ్య‌మ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టిమ‌రీ చెప్పేస్తున్నారు. ఇదీ.. వ‌ర్క్ ఫ్ర‌మ్ పై ఉద్యోగుల అభిప్రాయం. అయినా.. ఇవ‌న్నీ ఎవ‌రికి కావాలి? ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? కంపెనీకి ఏది కావాలో.. అదే చేయాల్సిందే. ఏమంటారు?