Begin typing your search above and press return to search.

రోటీన్ రొమాన్స్ ఓకే.. ఇలాంటి రొమాన్స్ చాలా అవసరమట

By:  Tupaki Desk   |   14 March 2020 5:30 PM GMT
రోటీన్ రొమాన్స్ ఓకే.. ఇలాంటి రొమాన్స్ చాలా అవసరమట
X
ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమ దాటినంతనే ఆటోమేటిక్ గా రంగప్రవేశం చేసేది రొమాన్సే. కొంతమంది మధ్య అదేమీ లేకుండా కూడా వచ్చేయొచ్చు అది వేరే విషయం. రోటీన్ రొమాన్స్ గురించి చాలామంది చాలా చెబుతారు కానీ.. తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. జీవితంలో ఒక్కసారైనా కొన్ని రకాల రొమాన్స్ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

ఒక జంట మధ్య అనుబంధం సరికొత్తగా.. ఎవర్ ఫ్రెష్ గా ఉండాలంటే.. సంతోషంగా సాగాలంటే వారి మధ్య శృంగార జీవితం ఎలా ఉండదన్నది చాలా కీలకమని చెబుతున్నారు. రోటీన్ గా సాగే దానికి భిన్నంగా కొన్ని రకాలైన శృంగారాలు చాలా అవసరమని చెబుతున్నారు. భార్యభర్తలు.. లేదంటే రిలేషన్ షిప్ లో ఉన్న జంట మధ్య చిన్న చిన్న గొడవలు.. అలకలు.. మనస్పర్థలు చాలా కామన్ అని.. అలాంటి వాటి కారణంగా కొన్నిసార్లు పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయని.. అలా జరిగిన తర్వాత కొంతకాలం భాగస్వామితో మాట్లాడకుండా ఉండటం వల్ల ఎలాంటి లాభం ఉండదని చెబుతున్నారు. దాని కంటే కూడా.. గొడవ తర్వాత శృంగారం చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని.. అనుబంధం మరింత బలపడుతుందట. ఈ సందర్భంగా జంట లో ఎవరో ఒకరు కాస్త తగ్గితే నష్టం లేదంటున్నారు.
శృంగారం అంటే రాత్రిపూట సాగేదన్న భావనకు చెక్ చెప్పాలని.. తెల్లతెలవారుజామున చేసే రొమాన్స్ చాలా కొత్తగా ఉంటుందట. ఇలా చేస్తే.. ఉదయాన్నే ఒత్తిడి.. టెన్షన్ పోయి కొత్త ఉత్సాహం తో పని చేస్తారని.. రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారని చెబుతున్నారు. కొంతమందికి రాత్రి మొదలు పెట్టి తెల్లవారే వరకూ రొమాన్స్ చేయాలనే ఉంటుంది.. ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు. కానీ.. ఈ ఫాంటసీని తీర్చుకోవటం పెద్ద కష్టం కాదని.. కాస్తంత ప్లానింగ్ ఉంటే చేయొచ్చంటున్నారు.

నిత్యం కాకున్నా.. ఏదైనా ఒక రోజును ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటే దాని వల్ల వచ్చే సంతోషం వేరుగా ఉంటుందని చెబుతున్నారు. వర్క్ టెన్షన్ లో ఉన్నప్పుడు చాలా త్వరగా శృంగారం చేయాల్సి ఉంటుందని.. దానికి చాలామంది సుముఖంగా ఉండరని.. కానీ జీవిత భాగస్వామి తో వేగంగా.. త్వరగా చేసినా కొన్నిసార్లకు ఇది మంచిదేనని చెబుతున్నారు. ఇలా చేయటం కారణంగా ఒత్తిడి నుంచి బయటపడొచ్చన్న మాట వినిపిస్తోంది. ఒక జంట మధ్య ఉండే బంధం కేవలం శృంగారం మాత్రమే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. మానసికంగా వారిద్దరి మధ్య దగ్గరితనం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. అర్థమవుతోందా...?