Begin typing your search above and press return to search.
షాకింగ్ః మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. మొదలైన విచారణ!
By: Tupaki Desk | 14 July 2021 9:31 AM GMTక్రికెట్ వంటి క్రీడలో తరచూ వినిపించే మ్యాచ్ ఫిక్సింగ్ అంశం.. ఈ సారి టెన్నిస్ ను చుట్టు ముట్టింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ లో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో.. అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. బింబుల్డన్ లో ఒక సింగిల్స్ మ్యాచ్, ఒక డబుల్స్ మ్యాచ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు తలెత్తాయి.
ఈ రెండు మ్యాచుల్లో భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగినట్టు విమర్శలు రావడంతో.. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ చేపట్టింది. ఇవి రెండూ పురుషులకు సంబంధించిన మ్యాచులే కావడం గమనార్హం. డబుల్స్‌మ్యాచ్ విషయానికి వస్తే.. ఫేవరెట్ జోడీగా బరిలోకి దిగిన జంట మొదటి సెట్ గెలిచింది. కానీ.. ఆ తర్వాత రెండు సెట్లూ వరుసగా ఓడిపోయింది.
అయితే.. ఓడిపోయిన రెండు సెట్లకు సంబంధించి వీరు ఆడిన విధానం అనుమానాస్పదంగా ఉందని ప్రేక్షకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. అనవసరమైన తప్పిదాలు చేశారని, ఇది వాళ్ల ఆట లక్షణం కాదని భావిస్తున్నారు. చూస్తుంటే.. ఈ మ్యాచ్ ఫిక్స్ అయినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు.
ఇక, సింగిల్స్ మ్యాచ్ లో లైవ్ బెట్టింగ్ కూడా భారీగా నడిచినట్టు తేలిందట. ఈ మ్యాచ్ లో సర్వీస్ గేమ్ పైనా ప్రత్యేకంగా బెట్టింగ్ సాగినట్టు సమాచారం. దీంతో.. మిగిలిన మ్యాచ్ లపైనా ఐటీఐఏ విచారణ మొదలు పెట్టింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరిగిన మొత్తం 11 మ్యాచ్ లపై ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఫిర్యాదులు స్వీకరించిన ఐటీఐఏ.. లోతుగా దర్యాప్తు మొదలు పెట్టింది.