Begin typing your search above and press return to search.
షాకింగ్ నిజం.. పట్టభద్రులకు ఓట్లు వేయటం రాదా?
By: Tupaki Desk | 18 March 2021 5:30 AM GMTవినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. వారంతా పట్టభద్రులు. అదేనండి గ్రాడ్యుయేట్లు. అంత బాగా చదివిన వారికి సైతం ఓటు వేసే విషయంలో భారీగా తడబాటుకు గురయ్యారు. దీంతో.. వేలాది ఓట్లు చెల్లని పరిస్థితి. మిగిలిన ఎన్నికలతో పోలిస్తే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక చాలా భిన్నం. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే కచ్ఛితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వారికి మాత్రమే ఓటుహక్కు కల్పిస్తారు. ఇక.. పోలింగ్ విషయానికి వస్తే.. మిగిలిన ఎన్నికల మాదిరి కాకుండా.. బరిలో ఉన్న అందరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
పోటీ ఉన్న అభ్యర్థులకు వరుస ప్రాధాన్యతను అనుసరించి ఓట్లు వేసే వీలుంది. ఉదాహరణకు హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక ఓటరు వారందరికి ఓటు వేసే అవకాశం ఉంది. ఒకటి నుంచి 93 అంకెలు చొప్పున క్రమం తప్పకుండా ఓటు వేసే వీలుంది. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ ఓటును చెల్లనిదిగా గుర్తించి పక్కన పెడతారు. అంతేకాదు.. ఓటు వేసే సమయంలో.. పోలింగ్ అధికారులు ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. అంకెల్ని కూడా అక్కడ పేర్కొన్నట్లుగా వేయాలే కానీ.. ఇష్టం వచ్చినట్లుగా రోమన్ అంకెల్లో కానీ.. ఇతర గుర్తుల్లో కానీ వేయటానికి వీల్లేదు.
ఈ ఎన్నికలో ఉన్న సంక్లిష్టతను గుర్తించిన అన్ని రాజకీయపార్టీలు ఓటు వేసే విధానాన్ని అదే పనిగా ప్రచారం చేశారు. అయినప్పటికీ.. నల్గొండ.. హైదరాబాద్ రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా నమోదు కావటం ఆసక్తికరంగా మారింది. గురువారం ఉదయానికి నల్గొండ స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల రెండో రౌండ్ ఫలితాన్ని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సమయంలో గుర్తించిన దాని ప్రకారం.. రెండో రౌండ్ ముగిసే నాటికి చెల్లని ఓట్లు ఏకంగా 3009 కావటం గమనార్హం. మరింత ఆసక్తికర అంశం ఏమంటే.. నల్గొండతో పోలిస్తే.. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోచెల్లని ఓట్లు ఎక్కువగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గురువారం ఉదయం 5 గంటలకు తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే నాటికి హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో చెల్లని ఓట్లు 3374గా నమోదు కావటం గమనార్హం. నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో రెండురౌండ్లకు వచ్చిన చెల్లని ఓట్లతో పోలిస్తే.. హైదరాబాద్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తొలి రౌండ్ ముగిసే నాటికే ఇంత భారీగా చెల్లని ఓట్లు పడటం షాకింగ్ గా మారింది. అదే సమయంలో.. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ - బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. తొలి రౌండ్ లో వెయ్యి కంటే తక్కువ అధిక్యతే రావటం గమనార్హం. ఇలాంటి సమయంలో చెల్లని ఓట్లు ఊహించని ఫలితానికి తెర తీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.