Begin typing your search above and press return to search.

ఎలన్ మస్క్ చర్యలతో ట్విట్టర్ ‘కంపు’మయం..!

By:  Tupaki Desk   |   31 Dec 2022 5:21 AM GMT
ఎలన్ మస్క్ చర్యలతో ట్విట్టర్ ‘కంపు’మయం..!
X
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాక ఆ సంస్థల్లో అనేక మార్పులు చేపడుతున్నారు. ట్విట్టర్ సీఈవో సహా పలువురు డైరెక్టర్లను మార్చివేసిన ఎలన్ మస్క్ తనదైన మార్క్ ను చూపిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఎలన్ మస్క్ చర్యలు చూస్తుంటే అతడు ట్విట్టర్ కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నట్లుగా కన్పిస్తోంది.

ట్విట్టర్ కోసం వెచ్చిన వ్యయాన్ని తిరిగి రప్పించుకునే క్రమంలోనే ఎలన్ మస్క్ ఆ సంస్థలో చేపడుతున్న సంస్కరణలను విమర్శలకు తావిస్తోంది. ట్విట్టర్ ను నమ్ముకొని కొన్నేళ్లుగా పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఉన్నఫలంగా వారిని తొలగించడంతో వారంతా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

ఇక ట్విట్టర్ ఖాతాదారులను ఎలన్ మస్క్ వదల్లేదు. ట్విట్టర్ బ్లూ టిక్ వేరిఫికేషన్ పేరుతో ఒక్కొక్కరి నుంచి 8 నుంచి 12 డాలర్లను వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ట్విట్టర్ హెడ్ ఆఫీస్ లో సెక్యూరిటీ సిబ్బందితో పాటు శానిటైజేషన్ వర్కర్లను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఉద్యోగులంతా సొంత టాయిలెట్ పేపర్ ను కార్యాలయానికి తీసుకొస్తున్నారు. శానిటైజేషన్ సిబ్బంది లేకపోవడంతో కార్యాలయంలోని బాతురూములు మురికిగా మారుతున్నాయి. ఉద్యోగులు తిన్న ఆహారం డస్ట్ బీన్లలో పేరుకుపోతోంది. వాటిని తీసేవారు లేక కార్యాలయంలోని గదులన్నీ దుర్వాసన వెదజల్లుతోంది.

దీంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోని నాలుగు అంతస్తుల్లో రెండు అంతస్థులను మూసివేశారు.శాక్రమెంటో కాలిఫోర్నియాలోని ట్విట్టర్ డేటా సెంటర్లో ఖర్చు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుండటంతో ఆ ప్రభావం సైట్ పనితీరుపై పడతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కోలోని కార్యాలయాలకు అద్దె చెల్లింపులను కోల్పోయిందని.. సీటెల్‌లోని దాని భవనానికి అద్దె చెల్లించడం ఆపివేసిందని ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్ కొంతమంది విక్రేతలకు చెల్లింపులను కోల్పోయినట్లు లేదా ఆలస్యం చేసినట్లు మరో నివేదికలో వెల్లడైంది. మొత్తంగా మస్క్ ట్విట్టర్ బడ్జెట్ నుంచి కార్మికేతర ఖర్చుల్లో $500 మిలియన్లను సేవ్ చేసే ప్రయత్నాలు చేసున్నారని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.