Begin typing your search above and press return to search.
షాకింగ్ః పాకిస్తాన్ నుంచి వీడియో కాల్.. చంపేస్తామని బీజేపీ నేతకు బెదిరింపులు!
By: Tupaki Desk | 15 March 2021 5:30 PM GMTనిర్మల్ జిల్లా పరిధిలోని భైంసాలో చెలరేగిన అల్లర్ల తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా పాకిస్థాన్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని నిర్మల్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి సంచలన విషయం బయటపెట్టారు. ఈ మేరకు రక్షణ కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
ఈనెల 12వ తేదీ రాత్రి 12ః57 నుంచి వరుసగా మూడుసార్లు ఫోన్ వచ్చిందని తెలిపారు. +923481411535 నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఆ సమయంలో తాను నిద్రపోయానని, అందుకే ఫోన్ ఎత్తలేదని తెలిపారు.
అయితే.. ఆ తర్వాత 13వ తేదీ ఉదయం 10ః34 గంటలకు వాట్సాప్ వీడియో కాల్ వచ్చిందని చెప్పారు. ఆ కాల్ లిఫ్ట్ చేయగా.. తనను దుర్భాషలాడుతూ.. చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వేగంగా దర్యాప్తు చేపట్టి, ఈ కాల్స్ వెనుక ఉన్నవారిని గుర్తించాలని కోరారు. కాగా.. భైంసాలో ఇరువర్గాల మధ్య ఇటీవల ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదలైన రాజకీయ వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతున్నాయి.