Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. వీడియోకాన్‌ సీఈవో వేణుగోపాల్‌ అరెస్టు!

By:  Tupaki Desk   |   26 Dec 2022 10:16 AM GMT
షాకింగ్‌.. వీడియోకాన్‌ సీఈవో వేణుగోపాల్‌ అరెస్టు!
X
వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్, సీఈవో వేణుగోపాల్‌ ధూత్‌ను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అరెస్టు చేసింది. గతంలో ఇదే కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్తను సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ సహాయంతో ఐసీఐసీఐ బ్యాంకును మోసగించిన కేసులో ధూత్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు చందా కొచ్చర్, ఆమె భర్తను డిసెంబర్‌ 26 వరకు కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగించింది. వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు బ్యాంకు మంజూరు చేసిన రుణాలలో మోసం, అవకతవలకు జరిగాయని అభియోగాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో నాటి ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొశ్చర్, ఆమె భర్త దీపక్‌ కొశ్చర్‌ కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వచ్చాయి. వేణుగోపాల్‌ ధూత్‌ ప్రమోట్‌ చేసిన వీడియోకాన్‌ కంపెనీలకు బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్, ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంక్‌ క్రెడిట్‌ విధానాన్ని ఉల్లంఘించి ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని సీబీఐ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో 2019లో సీబీఐ.. చందా కొచ్చర్‌ దంపతులు, వేణుగోపాల్‌ దూత్‌ తో పాటు సుప్రీమ్‌ ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నిర్వహించే నూపవర్‌ రెన్యూవబుల్స్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌) కంపెనీలపై ఐపిసి సెక్షన్ల కింద ఎఫ్‌ఆర్‌ఐ నమోదైంది. నేరపూరిత కుట్ర, అవినీతికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది.

2009లో చందా కొచ్చర్‌ నేతృత్వంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ మంజూరు కమిటీ బ్యాంకు నియమాలు, విధానాలకు విరుద్ధంగా వీడియో కాన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కి రూ. 300 కోట్ల టర్మ్‌ లోన్‌ మంజూరు చేసింది. లోన్‌ మంజూరైన మరుసటి రోజు.. వేణుగోపాల్‌ ధూత్‌ వీటిలో రూ.64 కోట్లను తన కంపెనీ నూపవర్‌ రెన్యూవబుల్స్‌ కి బదిలీ చేశాడు. ఈ క్రమంలో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని.. నాటి ఐసీఐసీఐ సీఈవో చందా కొశ్చర్‌ తో కలిసి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. తాజాగా ఆయనను అరెస్టు చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.