Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ కు షాకుల మీద షాకులు
By: Tupaki Desk | 3 July 2021 7:31 AM GMTప్రపంచంలో ఎవరి ఊహకందని పనులు చేయడంలో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ముందుంటారు. అంతరిక్షంలోకి పర్యాటకులను పంపించే భారీ క్రతువును ఈయన నిజం చేశారు. ఇక బిట్ కాయిన్ వంటి వాటిపై నోరు పారేసుకొని నిండా మునిగాడు. ఇటీవల ఈయన అంతరిక్ష మిషన్లు కాలిబూడిదై అపారనష్టాన్ని తెచ్చాయి.
అయినా కూడా ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన ప్రయత్నాలు మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇటీవలే ‘బిట్ కాయిన్ ’పై ట్వీట్ పెట్టిన ఎలన్ మాస్క్ రూ.1.10 లక్షల కోట్లు నష్టపోయాడు. అతగాడి కలల పంటగా చెప్పే స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ సీరియల్ నంబర్ 10 కూడా లాంచ్ పాడ్ పై లేసి పేలిపోయి ఘోర వైఫల్యాన్ని తెచ్చింది.
అయితే వైఫల్యాలనే పాఠాలుగా నేర్చుకొని కొత్త ఆవిష్కరణల వైపు ఎలన్ మాస్క్ అడుగులు వేస్తున్నారు. ఆయన ఎలక్ట్రిక్ కార్ల రంగంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే ఎలక్ట్రిక్ కార్లలో సంచలనంగా మారిన టెస్లా ఎస్ ప్లెయిడ్ కారును ఆవిష్కరించారు. దీని విలువ అక్షరాల కోటి రూపాయలు.
ఈ కారును ముచ్చటపడి పెన్సిల్వేనియా కు చెందిన పారిశ్రామికవేత్త మార్క్ గెరాగోస్ ఇటీవల కొన్నాడు. జులై 1న తన ఇంటి నుంచి కారును బయటకు తీసి ప్రయాణించారు. కొద్ది దూరంగా వెళ్లగానే కార్లో మంటలు చెలరేగాయి. పారిశ్రామికవేత్త ఆ కారును బయటకు రావడానికి ప్రయత్నించినా డోర్లు తెరుచుకోలేదు. చివరకు అద్దాలు పగులగొట్టి అతికష్టం మీద అందులోకి బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు.
ఆ తర్వాత తనకు ఎదురైన ఈ భయానక ఘటనను కాలినకారును ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదిప్పుడు వైరల్ గా మారింది. ఎలన్ మాస్క్ కార్ల కంపెనీ ‘టెస్లా’కు శరాఘాతంగా మారింది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. దెబ్బకు అమ్మకాలు పడిపోయాయి.
నిజానికి ఎలన్ మాస్క్ ఇటీవల కారు భద్రతపై మాట్లాడారు. వేగంలో ఫెరారీ, భద్రతలో వోల్వో కంటే ‘టెస్లా ఎస్ ప్లెయిడ్’ ఉత్తమంగా ఉంటుందని చెప్పారు. అంత గొప్పగా చెప్పేసరికి.. ఎలక్ట్రిక్ వాహనం అనే సరికి దీనికి డిమండ్ ఏర్పడింది.
కానీ ఇప్పుడు ఈ కారు మంటలకు ఆహుతి కావడంతో ఎలన్ మాస్క్ మాటలు ఒట్టి బుర్రకథ అని తేలిపోయింది.కారు భద్రతపై అనుమానాలు బలపడ్డాయి.