Begin typing your search above and press return to search.
మాట వరసకు కేసీఆర్ అంటే..ఆ దేశాధ్యక్షుడు అమల్లోకి తెచ్చేశాడు
By: Tupaki Desk | 3 April 2020 5:10 AM GMTకరోనాకు మందు లేదు. కానీ.. కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేయటం పెద్ద విషయం కాదు. ప్రజల్లో కరోనా మీద అవగాహన ఉన్నా.. మితిమీరిన విశ్వాసం లేకున్నా.. కరోనాను ఇట్టే కంట్రోల్ చేయొచ్చు. బ్యాడ్ లక్ ఏమంటే.. ప్రపంచంలోని పలు దేశాల్లోని ప్రజలు తమకు తాముగా చేసిన తప్పులతో కరోనాను పెంచి పోషిస్తున్న పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు భారీ ఎత్తున కరోనా మరణాలు చోటు చేసుకున్న ఇటలీ సంగతే చూస్తే.. ప్రభుత్వ ఆదేశాల్ని పెడచెవిన పెట్టిన పాపానికి ఆ దేశస్తులు ఎంత భారీగా మూల్యం చెల్లించుకున్నారో తెలిసిందే. ఈ కారణంతోనే కావొచ్చు.. కొన్ని దేశాల్లో కరోనా విషయంలో తాము తీసుకున్న ఆదేశాల్ని అమలు చేయని ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి ఆయా ప్రభుత్వాలు.
ఆ మధ్యన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. లాక్ డౌన్ అమలును సీరియస్ గా తీసుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే కాల్చి చంపేయాలన్న ఆదేశాల్ని ఇచ్చి తీరుతామంటూ కరోనా మీద ఎంత కేర్ ఫుల్ గా ఉండాలన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పేశారు. కేసీఆర్ మాటలు విన్న పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసింది లేదు.
కేసీఆర్ మాటల్ని విన్నారో.. లేక తనకు తాను నిర్ణయం తీసుకున్నారో కానీ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు తాజాగా సారు మాటల్ని చేతల్లోకి తీసుకొచ్చేశారు. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని సహించేది లేదని.. అలాంటి వారిని కాల్చి చంపాలని ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధాని మనీలాలో కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ను విధించిన నేపథ్యంలో టీవీలో దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా దేశంలోని మిలిటరీ.. పోలీసు అధికారులకు తీవ్ర స్థాయిలో ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని.. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇప్పటివరకూ ఆ దేశంలో 2311 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 96 మంది మరణించారు. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల్ని కంట్రోల్ చేసేందుకు వీలుగా ‘‘కాల్చివేత’’ ఆదేశాల్ని జారీ చేశారు. దేశాధ్యక్షుల వారి మాటను సీరియస్ గా తీసుకొని.. తమ పోలీసులు ఎక్కడ కాల్చి వేస్తారని ఫీలయ్యారో కానీ వెంటనే సీన్లోకి వచ్చిన పోలీసు బాస్ మాత్రం.. దేశాధ్యక్షుడి మాటల్లోని తీవ్రతను ప్రజలు అర్థం చేసుకుంటారని.. తమ సిబ్బంది ఎవరూ ప్రజల్ని కాల్చి చంపరంటూ వివరణ ఇచ్చారు. ఏమైనా.. లాక్ డౌన్ ఉల్లంఘనల విషయంలో కేసీఆర్ మాట వరసకు అన్న మాటల్ని.. ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు మాత్రం చేతల్లోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.