Begin typing your search above and press return to search.

మహిళలు స్నానం చేస్తుంటే డ్రోన్స్ తో షూట్ చేస్తున్న పోలీసులు..అడ్డుకున్న రైతులపై దౌర్జన్యం!

By:  Tupaki Desk   |   21 Feb 2020 8:00 AM GMT
మహిళలు స్నానం చేస్తుంటే డ్రోన్స్ తో షూట్ చేస్తున్న పోలీసులు..అడ్డుకున్న రైతులపై దౌర్జన్యం!
X
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతమైన మందడంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అసెంబ్లీ లో సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చు అని ప్రకటన చేసినప్పటి నుండి నేటి వరకు కూడా అమరావతి ప్రాంత ప్రజలు ...ఒకే రాజధాని అది అమరావతే అంటూ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు ఆందోళన చేయబట్టి దాదాపుగా రెండు నెలలు దాటిపోతుంది. అయినా కూడా రైతులు దీక్షలు , ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక వీరిని అదుపులో ఉంచడానికి పోలీసులు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు.

ఈ నేపథ్యం లో పోలీసులు , ఆందోళన కారుల మధ్య పలు సార్లు వాగ్వాదాలు జరిగాయి. తాజాగా మరోసారి మందడం ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త నెలకొన్నది. దీనికి కారణం పోలీసులు రైతుల నిరసనలని డ్రోన్ కెమెరాతో షూట్ చేయడమే. ఆందోళనలు రెండు నెలలు గా కొనసాగుతున్న నేపథ్యం లో దీంతో రైతుల నిరసన కార్యక్రమాలను పోలీసులు డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆడవాళ్లు స్నానంచేస్తుండగా డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ షూటింగ్ ఆపేయాలని పోలీసులకు రైతులు కోరారు.

కానీ వారు దాన్ని కొనసాగిస్తుండటంతో ..దీంతో రైతులు..పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకోవటంత ఏపీ రాజధాని అమరావతి పరిధిలో మందడంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో మేం పోలీసులం..మాపైనే దాడికి దిగుతారా, అంటూ ఖాకీలు క్రౌర్యం చూపారు. రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రైతులు కూడా మమ్మల్ని ..మా ఆడవారిని అవమానిస్తు తిరిగి మమ్మల్నే అరెస్ట్ లు చేస్తారా, అంటూ పోలీసులను అడ్డుకున్నారు. దాంతో మరింతగా రెచ్చిపోయిన పోలీసులు రైతులపై మరింతగా తిరగబడ్డారు. దీంతో రైతులు కర్రలతో పోలీసులపైకి తిరగబడ్డారు దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరగటంతో ఆ మందడం లో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై , రాజధాని ప్రాంత ప్రజలు మాత్రం ... పోలీసులు తమపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏదో ఒక సాకుతో తమపై వేధింపులకు పాల్పడుతున్నారని.. మహిళలు అని కూడా చూడకుండా కొడుతున్నారని.. గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.