Begin typing your search above and press return to search.
షూటర్ సిప్పీ హత్య జరిగిన ఏడేళ్లకు అరెస్టు.. ఇంతకూ ఆమె ఎవరంటే?
By: Tupaki Desk | 17 Jun 2022 3:30 AM GMTఅతను చిన్నా చితక వ్యక్తి కాదు. జాతీయ స్థాయి షూటర్. అంతేకాదు.. కార్పొరేట్ లాయర్ కూడా. అక్కడితో అగిపోకూడదు. అతగాడి ప్రొఫైల్ మరింత ఉంది. ఛండీగఢ్ మాజీ సీజే ఎస్ఎస్ సిద్ధూ మనమడు కూడా. అలాంటి వ్యక్తి దారుణంగా హత్యకు గురి కావటం.. హత్య జరిగిన ఏడేళ్లకు కానీ నిందితురాలన్న ఆరోపణలతో ఒక మహిళ అరెస్టు కావటం సంచలనంగా మారింది. హత్య జరిగిన కొద్దిరోజులకే ఈ పాపానికి కారణం ఫలానా వారు అయి ఉంటారన్న ప్రచారం జరిగినా.. అందుకు తగ్గ సాక్ష్యాల్ని సిద్ధం చేసుకోవటానికి సీబీఐకు ఏడేళ్లు పట్టింది.
ఇంతకీ ఆ షూటర్ మరెవరో కాదు.. సిప్పీ సిద్ధూ. అప్పట్లో దేశ వ్యాప్తంగా అతగాడి హత్యోదంతం సంచలనంగా మారింది. ఈ హత్యకు కారణమైన అనుమానితుల్లో సిద్ధూ గర్ల్ ఫ్రెండ్ కమ్ హిమాచల్ ప్రదేశ్ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కుమార్తె ప్రొఫెసర్ కల్యాణి ముందున్నారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను హత్య చేయించిందన్న మాట బలంగా వినిపించింది. అయితే.. దాన్ని నిరూపించే ఆధారాలు లభించని పరిస్థితి.
ఇలాంటి వేళ.. తాజాగా ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దాదాపు ఏడేళ్ల క్రితం అంటే 2015లో 35 సిద్దూ దారుణ హత్యకు గురయ్యాడు. ఛండీగఢ్ లో చోటు చేసుకున్న ఈ హత్య అప్పట్లో సంచలనంగా మారింది.
అతడి బాడీలో బుల్లెట్లు దిగబడి ఉండటం.. ఈ హత్య వేళలో అతడితో పాటు ఒక మహిళ ఉన్నట్లుగా గుర్తించారు. ఆమె ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున విచారణతో పాటు.. సదరు మహిళ తనకు తానుగా ముందుకు వస్తే.. అనుమానితురాలిగా కాకుండా సాక్ష్యంగా భావిస్తామని పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు.
అయినప్పటికీ ఎవరూ ముందుకు రాని పరిస్థితి. అయితే.. సిద్దూ హత్య కేసులో కీలక నిందితురాలిగా అతగాడి గర్ల్ ఫ్రెండ్ ప్రొఫెసర్ కల్యాణిగా గుర్తించారు. సిద్దూతో రిలేషన్ బెడిసి కొట్టిన నేపథ్యంలోనే కిరాయి వ్యక్తుల్ని దింపి.. అతడ్ని హత్య చేసినట్లుగా సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ హత్య కేసు హైప్రొఫైల్ కేసు కావటంతో సీబీఐ డీల్ చేస్తోంది. నిజానికి సిద్దూ హత్య జరిగిన తర్వాత సోషల్ మీడియాలో అతడి చావు వెనుక ప్రొఫెసర్ కల్యాణి ఉన్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అయితే.. అందుకు తగ్గ ఆధారాలు లేని నేపథ్యంలో ఆమె అరెస్టు సాధ్యం కాలేదు. తాజాగా పక్కా ఆధారాలు ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. అనంతరం రిమాండ్ కోసం న్యాయస్థానాన్ని కోరి.. ఆమెను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ.. ఇప్పుడు మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడినట్లుగా చెబుతున్నారు.