Begin typing your search above and press return to search.
చంద్రబాబు సభలో షార్ట్ సర్క్యూట్
By: Tupaki Desk | 5 Sep 2015 5:30 PM GMTసాక్షాత్తు రాష్ర్ట ముఖ్యమంత్రి పాల్గొంటున్న సభ..సీఎం ప్రసంగించే స్టేజ్‌మీద భద్రత, ఏర్పాట్లు ఎలా ఉండాలి. చీమ చిటుక్కుమన్నా పసిగట్టేయాలి. కానీ మన అధికార వ్యవస్థ మొద్దు నిద్రావస్థలో ఉంది. వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. చివరకు ఆ స్టేజ్ పక్కన షార్ట్ సర్య్కూట్ అవుతుంటే స్వయంగా సీఎం చూసుకుని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. శనివారం విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు ప్రజలు కూడా హాజరయ్యారు. అయితే అధికారులు సభ డెకరేషన్ ఏర్పాట్లలో చూపిన శ్రద్ధ స్టేజ్ మీద పెట్టినట్టు లేదు. చంద్రబాబుతో పాటు మంత్రులందరు స్టేజ్ మీదకు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేశారు. కొద్దిసేపటి తర్వాత స్టేజ్ కు అనుకుని ఉన్న కరెంటు తీగలు అంటుకుని షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ పొగలు కమ్మకున్నాయి. వెంటనే ఈ సంఘటన చూసిన చంద్రబాబు మంత్రి గంటా దృష్టికి తీసుకువచ్చారు. గంటా ఒక్కసారిగా పైకిలేవడంతో అధికారులు ఆయన నుంచి వివరాలు తెలుసుకుని అప్రమత్తమయ్యారు.
ఎంతో మంది ఉన్నా చంద్రబాబు స్వయంగా ఈ ప్రమాదాన్ని గమనించే వరకు ఇది ఎవ్వరి కంటా పడలేదు. దీనిని బట్టి చూస్తే రాష్ర్ట ముఖ్యమంత్రి పాల్గొనే సభలో సెక్యూరిటీ, భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. స్టేజ్ మీద జరుగుతున్న ఈ సంఘటన చూసిన ప్రజలు కూడా సీఎం స్టేజ్ పక్కన షార్ట్ సర్క్యూట్ అయ్యిందని గమనించి అక్కడ నుంచి పరుగులు తీశారు. తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో సభ సజావుగా సాగింది. గోదావరి పుష్కరాల్లో అధికారుల నిర్లక్ష్యం అలసత్వంతో 30 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు సీఎం సభలోను అదే నిర్లక్ష్యం కనపడింది.