Begin typing your search above and press return to search.
పవన్ దెబ్బకు రూ.2వేల కోట్లు ఖర్చుకు ఏపీ సర్కార్ సిద్ధమైందా?
By: Tupaki Desk | 3 Oct 2021 2:30 AM GMTమొన్నటివరకు ఉన్న లెక్కలు.. సమీకరణాలు మారిపోయాయి. ఏపీలో తిరుగులేని రాజకీయ అధిక్యతను ప్రదర్శిస్తున్న సీఎం జగన్ దెబ్బకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం విలవిలలాడిపోతోంది. చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఆయన మాటలు ప్రజల స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇక.. లోకేశ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. కఠిన నియమాలతో.. తన రూపును మొత్తంగా మార్చేసుకున్న లోకేశ్.. తన మాటల్లో పదును ఈ మధ్య పెరిగినట్లుగాచెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్నిటార్గెట్ చేసే విషయంలో ఆయన తీరులో చాలానే మార్పు వచ్చిందన్న మాట వినిపిస్తోంది.
అయినప్పటికి ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో గళం విప్పిన పవన్.. వైసీపీ నేతల మీదా.. ఏపీ ప్రభుత్వం మీదా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అది మొదలు పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పోరు సాగుతోంది. అనూహ్యంగా చంద్రబాబు.. లోకేశ్ ల ప్రస్తావన రాని పరిస్థితి.
గడిచిన కొన్ని నెలలుగా ఏపీలోని రోడ్ల దారుణ పరిస్థితి మీద ఇప్పటికే బోలెడన్ని విమర్శలు.. ఆరోపణలు.. సోషల్ మీడియాలో ఎటకారాలు మొదలై.. అంతకంతకూ పెరగటమే కాదు.. ఏపీ ప్రభుత్వం ఈ సమస్యపై ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. పెద్ద ఎత్తున పాడైన రోడ్ల విషయంలోనూ రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతారు. ఇలాంటి వేళ.. పాడైన రోడ్లకు శ్రమదానం చేసే కార్యక్రమానికి పవన్ కల్యాణ్ పిలపునివ్వటం తెలిసిందే.
ఈ రోజున రాజమహేంద్రవరంలోశ్రమదానం చేసి రోడ్లను బాగుచేసే కార్యక్రమానికి తెర తీశారు. ఈ ప్రోగ్రాం ద్వారా రాష్టంలోని రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న భావనలో ఈ ప్రోగ్రాంను చేపట్టినట్లు చెబుతున్నారు. ఇలాంటివేళ.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ప్రభుత్వ విధానాల్ని పొగిడారు. పవన్ ప్రస్తావనను తీసుకొచ్చిన ఆయన తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.
కొవిడ్ నిబంధనలు అందరికీ సమానమేనని.. ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు అన్న ఆయన.. ఇలాంటి సమయంలో బలప్రదర్శన కారణంగా ప్రజలే ఇబ్బందులకు గురవుతారన్నారు. పవన్ టూర్ ను అడుగడుగునా ఆపుతున్నారన్న ఆరోపణను కొట్టి పారేశారు. ''తమ ప్రభుత్వానికి పవన్ టూర్ ను ఆపాల్సిన అవసరం ఏమిటి? ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. రోడ్ల గుంతలు మీరు పూడ్చటమేమిటి? అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.2200 కోట్లు కేటాయింయారు. వర్షాలు తగ్గగానే మరమ్మత్తులు చేస్తాం. ఈ లోపు టెండర్ల ప్రక్రియ జరుగుతుంది'' అని పేర్కొన్నారు.
ఇదంతా చూస్తే.. రోడ్ల మీద ప్రజల్లో జరుగుతున్న చర్చ.. సోషల్ మీడియాలో రచ్చతోపాటు.. పవన్ ఇదే అంశాన్ని టార్గెట్ చేయటం ద్వారా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం ఒక దెబ్బతో మూడు నాలుగు పిట్టల్ని కొట్టే ప్లాన్ చేశారని చెప్పాలి. గడిచిన ఏడాదిన్నర కాలంగా రోడ్ల దుస్థితి మీద ఏపీ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. గడిచిన ఆర్నెల్లుగా ఇది పీక్స్ అన్నట్లుగా మారింది. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సరైన ఇష్యూ కోసం వెతుకుతున్న పవన్ అండ్ కోకు రోడ్ల వ్యవహారాన్ని టేకప్ చేయాలని డిసైడ్ అయ్యారు.
పవన్ కారణంగా రోడ్ల వ్యవహారంపై ఏపీ సర్కారు వెనువెంటనే స్పందించక తప్పలేదంటున్నారు. దీనికి తాజా సజ్జల మాటలే నిదర్శనంగా చెబుతున్నారు. పవన్ చేపట్టిన రోడ్ల ఇష్యూను తప్పు పడుతూ.. గతంలో టీడీపీ ప్రభుత్వంలో రోడ్ల మరమ్మత్తులకు రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చారని.. ఐదేళ్లలో ఒక్క కొత్త రోడ్డును కూడా చంద్రబాబు వేయలేదన్న సజ్జల మాటల్ని చూస్తుంటే.. ఇప్పుడే ఈ డిమాండ్ ను తెర మీద తేవటం వెనుక రాజకీయం ఉందన్నట్లుగా సజ్జల యతీరును చూస్తుంటే అర్థమైనట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. మొత్తానికి పవన్ కల్యాణ్ తన మాటలు.. చేతలతో ఏపీ ప్రభుత్వాన్ని కదిలించగిలిగారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.