Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక మందు తాగొద్దా? డాక్టర్లు ఏమంటున్నారు?

By:  Tupaki Desk   |   22 Jan 2021 2:30 AM GMT
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక మందు తాగొద్దా? డాక్టర్లు ఏమంటున్నారు?
X
కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాక అందరికీ ఎన్నో డౌట్లు.. టీకా తీసుకున్నాక విషమిస్తుందని కొందరు.. ఎఫెక్ట్ అవుతుందని మరికొందరు భయంతో దీన్ని తీసుకోవడానికే ముందుకు రావడం లేదు. కొందరు చనిపోవడం.. అస్వస్థతకు గురి అయిన సంఘటనలు ఉన్నాయి.

అయితే కరోనా టీకా తీసుకున్నాక ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని.. అందులోనూ అల్కహాల్ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాక మద్యం తాగితే డేంజర్ అని రష్యాకు చెందిన అడ్వైజరీ ఒక ప్రకటన జారీ చేయడం సంచలనమైంది. కరోనా టీకా తీసుకున్న 45 రోజుల వరకు తప్పనిసరిగా అల్కహాల్ కు దూరంగా ఉండాలని రష్యన్ వైద్యులు సూచిస్తున్నారు.

ఇక భారత్ లోనూ మొదటి గ్రూపులో టీకా తీసుకున్న వారిందరూ కూడా మద్యాన్ని 45 రోజుల పాటు తీసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ టెక్నికల్ అడ్వైజర్ తోపాటు, ఐసీఎంఆర్ లో కోవిడ్ టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న వైద్య నిపుణులు కూడా ఇప్పుడు దీన్ని ధ్రువీకరించడం వివేషం.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరైనా మద్యం తీసుకోవడం.. ఇంకా మత్తు పదార్థాలైన డ్రగ్స్ తీసుకుంటే వారిలో కరోనా ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయదని పరిశోధనలో తేలినట్టు చెబుతున్నారు. 45 రోజులపాటు మద్యానికి దూరంగా ఉండటం వల్ల వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి కూడా ఎలాంటి సైంటిఫిక్ స్టడీ లేదని మరికొందరు డాక్టర్లు చెబుతున్నారు.

మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీబాడీలు సరిగా తయారు కావని యూకే మెడిసిన్స్ ఏజెన్సీ కూడా చెబుతోంది. మొత్తంగా వ్యాక్సిన్ తీసుకున్నాక జనాలు మద్యం మానేస్తేనే బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.