Begin typing your search above and press return to search.
కరోనా వచ్చి తగ్గిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలా ?
By: Tupaki Desk | 16 Jan 2021 1:24 PM GMTప్రపంచ దేశాలను గత పది నెలలుగా అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే సమయం వచ్చేసింది. వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాల కార్యక్రమం దేశవ్యాప్తంగా శనివారం నుంచి మొదలుకానుంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించిన నేపథ్యంలో.. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాలు వేయడం మొదలుపెట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లుచేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగానే దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిగా మనీశ్ కుమార్ అనే పారిశుద్ధ్య కార్మికుడు నిలిచారు. ఆయన వ్యాక్సిన్ వేయించుకోగానే అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి అభినందించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో పాటు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా సమక్షంలో ఈ వ్యాక్సిన్ వేశారు. అనంతరం రణ్‌దీప్ గులేరియా కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎయిమ్స్ లో వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేయించుకున్న వారు అనంతరం వరుసగా వేయించుకున్నారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ సామర్థ్యంపై నమ్మకం కలిగిచేందుకు ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇదిలా ఉంటే .. కరోనా ను అంతం చేయడం కోసం తీసుకొచ్చిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల వితరణ మొదలైనా కూడా కొందరి లో కొన్ని అపోహలు , అనుమానాలు ఇంకా అలాగే మెదులుతున్నాయి. వాటిల్లో అతిముఖ్యమైనది ఏమిటి అంటే ... కరోనా టీకా ను కరోనా సోకి తగ్గిన వారు తీసుకోవాలా? వద్దా?. దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో .. కరోనా సోకి , తగ్గిపోయిన వారు కూడా ఈ వ్యాక్సినేషన్ పక్రియ లో పాల్గొని వ్యాక్సిన్ తీసుకోవాలి అని అమెరికా అంటువ్యాధుల నివారణ , నియంత్రణ కేంద్రం అంటుంది. వైరస్ నుండి కోలుకున్న తర్వాత మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో చెప్పలేము అని కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం మేలు అని అని సూచిస్తుంది. కరోనా పాజిటివ్ అని తేలి , తగ్గిపోయింది కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు అని అన్నారు.